అమలతో స్టెప్పులేసిన నాగ్.. వర్మ ఏంటి అలా అన్నారు!
బిగ్ బాస్.. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.;
బిగ్ బాస్.. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్టేజిపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన భార్య అలాగే ఆ సినిమా హీరోయిన్ అమల, శివ సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వచ్చి స్టేజిపై సందడి చేశారు.
విషయంలోకి వెళ్తే.. శివ మూవీ.. ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడమే కాకుండా.. ఈ సినిమా అప్పటికీ ఇప్పటికే ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అమల విచ్చేసింది. అమల స్టేజ్ పైకి రాగానే 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు మళ్లీ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ నాగార్జున తెలిపారు. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ సాంగ్లు వేయగా జంటలుగా ఏర్పడి హౌస్ మేట్స్ తమ డాన్స్ తో అదరగొట్టేశారు. అలా పవన్, రీతులు ఒక రొమాంటిక్ పాటకు డాన్స్ చేయగా.. వీరి డాన్స్ చూసి అమల మురిసిపోయారు.
ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఇక వర్మ ఎంట్రీ తోనే రాము రాథోడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్? అని రాము రాథోడ్ వర్మను అడగా.. చాలా సాడ్ గా ఫీల్ అయ్యా.. స్టుపిడ్ క్వశ్చన్ అని అనేశారు. ఇక రాములోని రాము బయటకు వచ్చారని నాగార్జున అడగగా.. నిన్ను బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఉంచితే ఉంటావా? అని నాగార్జున అడిగారు. దానికి వర్మ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటాను అని తనదైన స్టైల్ లో సమాధానం ఇవ్వడంతో వర్మ మళ్ళీ తనలోని కోణాన్ని బయటపెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అమల, నాగార్జున విషయానికి వస్తే తొలిసారి అమల చినబాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాని డి రామానాయుడు నిర్మించగా.. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 1992లో వీరి వివాహం జరగగా.. 1994లో అఖిల్ జన్మించారు.. నిజానికి చినబాబు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో శివ, ప్రేమ యుద్ధం, నేను మీరు, చైతన్య, సంకీర్తన వంటి చిత్రాలలో కలిసి నటించారు. వివాహం తర్వాత అమల ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.