బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నారా?
దీంతో మూడో సీజన్ ను హోస్ట్ చేసే బాధ్యతల్ని కింగ్ నాగార్జునకు ఇచ్చారు.;
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు రెడీ అవుతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ జులై నుంచే మొదలవుతుందని ముందుగా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎప్పటిలానే బిగ్ బాస్ రెగ్యులర్ గా సెప్టెంబర్ లోనే స్టార్ట్ కానుంది.
తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ను జూ. ఎన్టీఆర్ హోస్ట్ చేసి తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టడంతో పాటూ ఆ షో తో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరై మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక తర్వాత రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. కానీ నాని యాంకర్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.
దీంతో మూడో సీజన్ ను హోస్ట్ చేసే బాధ్యతల్ని కింగ్ నాగార్జునకు ఇచ్చారు. అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసిన అనుభవం ఉండటంతో నాగ్ బిగ్ బాస్ ను చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. ఇక అప్పటినుంచి ప్రతీ సంవత్సరం బిగ్ బాస్ కొత్త సీజన్ ను నాగార్జునే హోస్ట్ చేస్తూ వస్తున్నారు.
అలా ఏడాదికి ఒకటి చొప్పున 8 సీజన్లు సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఇప్పుడు హోస్ట్ ను మార్చనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. నాగార్జున పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బిగ్ బాస్ ను హోస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం.
ఇక బాలయ్యకు కూడా హోస్ట్ గా మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. అన్‌స్టాపబుల్ షో తో భారీ క్రేజ్ దక్కించుకున్న బాలయ్య బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తే అది నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. బాలయ్య టెంపర్, అతని స్వభావం ఈ రియాలిటీ షో ను మరింత రక్తి కట్టించడం గ్యారెంటీ. అంతేకాదు బాలయ్య ఈ షో చేస్తే బిగ్ బాస్ కు ఈ అంశం చాలా పెద్ద ప్లస్ కానుంది. మరి బాలయ్య ఈ విషయంలో ఏమంటారో చూడాలి.