బిగ్ బాస్ దశావతారం.. కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్.. వారికే ఎక్కువ ప్రాధాన్యత?

ఈసారి బిగ్ బాస్ దశావతారం అంటూ ప్రారంభం కాబోతున్న ఈ కొత్త సీజన్లో ఊహించని టాస్కులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆటలు ఉండబోతున్నట్లు సమాచారం.

Update: 2026-06-09 09:43 GMT

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ హోస్ట్ నాగార్జున ఇటీవల ఒక వీడియోని రిలీజ్ చేశారు.ఈ మేరకు బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతోందని చెబుతూ ఒక అదిరిపోయే వీడియోని షేర్ చేశారు . పైగా "బిగ్ బాస్ అంటే కేవలం యుద్ధాలు గెలిచే రాజ్యం మాత్రమే కాదు.. కోట్లాది హృదయాలను గెలుచుకున్న సామ్రాజ్యం "అంటూ ఆకట్టుకునే డైలాగ్ తో ఈ వీడియోని రిలీజ్ చేశారు.

అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కాదు బిగ్ బాస్ దశావతారం అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కొత్త సీజన్ పై అంచనాలు క్రియేట్ చేసింది. ఈసారి బిగ్ బాస్ దశావతారం అంటూ ప్రారంభం కాబోతున్న ఈ కొత్త సీజన్లో ఊహించని టాస్కులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆటలు ఉండబోతున్నట్లు సమాచారం.

మరొకవైపు సీజన్ 10 అయితే త్వరలో ప్రారంభం కాబోతోంది అని ప్రకటించారు మరి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సంజన గల్రానీ ఇటీవల తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొంతమంది పేర్లను ప్రస్తావిస్తూ ఒక లిస్టు షేర్ చేసింది. అందులో సీరియల్ నటీమణులు దీపికా రంగరాజు, హరిత, పల్లవి గౌడ ,పల్లవి రామిశెట్టి వంటి సీరియల్ నటీమణులు ఉండగా.. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహ తోపాటు సీరియల్ నటుడు పవన్ కళ్యాణ్, యూట్యూబర్ ఉప్పల్ బాలు, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు ఆమె ప్రకటించింది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో లిస్టు వైరల్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న కంటెస్టెంట్ లిస్ట్ విషయానికి వస్తే..పల్లవి గౌడ , ఎక్స్ప్రెస్ హరి, రాయల్ మెక్ రమణ , నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, తేజస్విని గౌడ , శివ్ కుమార్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొత్త రూల్స్, డిఫరెంట్ టాస్కులు ఈసారి ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికైతే ఇందులో అటు యూట్యూబర్స్ కి , ఇటు సీరియల్ నటీమణులకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News