బిగ్ బాస్ 9.. మాస్క్ తీసి వాళ్ల గురించి చెప్పేశాడు..!
బిగ్ బాస్ సీజన్ 9లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఎలిమినేషన్ జరిగింది. సండే ఎపిసోడ్ లో హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఎలిమినేషన్ జరిగింది. సండే ఎపిసోడ్ లో హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఐతే వెళ్తూ వెళ్తూ అతను మాస్క్ తీసి హౌస్ లో ఉన్న ముగ్గురు మాస్క్ మ్యాన్ లు.. ఎలాంటి మాస్క్ లేని మరో ముగ్గురు ఎవరన్నది చెప్పాడు. ముందుగా మాస్క్ అంటే ముసుగులో ఉన్న వారిలో భరణి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ ని మాస్క్ కేటగిరిలో పెట్టాడు హరీష్. ఇక మాస్క్ లేని వారిలో కళ్యాణ్, శ్రీజ, తనూజ ఫోటోలను పెట్టాడు.
బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా హరిత హరీష్..
ఐతే హరీష్ ఈ వారం తనని పంపిస్తారని తను కూడా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా.. అందుకే ఎలాంటి షాకింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా కనీసం అప్సెట్ గా కూడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే హమ్మయ్య ఇంటికి వెళ్తున్నా అనే హ్యాపీనెస్ కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా హరిత హరీష్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చాడు. అక్కడ కూడా మాస్క్ మ్యాన్ గా వచ్చిన హరీష్ బిందు మాధవి, అభిజిత్ లతో రెడ్ మార్క్ తెచ్చుకున్నాడు. బిందు అయితే అతని మెడలో లూజర్ అనే బోర్డ్ కూడా వేసింది.
ఫైనల్ గా అగ్నిపరీక్ష లో ఉన్న 13 మందిలో బిందు మాధవినే మళ్లీ హరీష్ ని హౌస్ లోకి పంపించింది. ఐతే తను ఎలా ఉన్నానో అలానే హౌస్ లో కూడా ఉంటున్నా అనుకున్నాడు హరీష్. కానీ మనం బిగ్ బాస్ హౌస్ కి వచ్చాం. ఇక్కడ కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా అడ్జెస్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఆయనకు లేదు. రెండో వారం ఐతే అతను 3, 4 డేస్ అసలు ఏమి తినకుండా నిరాహార దీక్ష చేసినట్టు కనిపించాడు. లాస్ట్ వీక్ అదే నాలుగో వారం కూడా హెల్త్ అప్సెట్ వల్ల టాస్క్ నుంచి తప్పుకున్నాడు.
హరీష్ వచ్చిన ఛాన్స్ లను వాడుకోలేదు..
అలా హరీష్ తనకు వచ్చిన ఛాన్స్ లను వాడుకోలేదు. ఫైనల్ గా హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. కామనర్స్ నుంచి ఆరుగురు హౌస్ లోకి వెళ్లగా రెండో వారం మనీష్, 3వ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వగా లేటెస్ట్ గా హరీష్ కూడా బయటకు వచ్చాడు. ఇక హౌస్ లో శ్రీజ, కళ్యాణ్, డీమాన్ పవన్ ఉన్నారు. వారితో 3వ వారం హౌస్ లోకి వెళ్లిన దివ్య కూడా అగ్నిపరీక్ష ద్వారానే హౌస్ లోకి వచ్చే అవకాశం కలిగింది..
బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ వీక్ దివాళి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. అప్పటికి ఐదు వారాలు పూర్తవుతాయి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 రెండో వెర్షన్ అంటే 2.O మొదలు పెడతారట. అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది.