బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా సామాన్యుడు..!

బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం ముగిసింది. ఈ సీజన్ ని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా మొదలు పెట్టారు బిగ్ బాస్.;

Update: 2025-12-21 17:30 GMT

బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం ముగిసింది. ఈ సీజన్ ని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా మొదలు పెట్టారు బిగ్ బాస్. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ని ఎంపిక చేసి వారి నుంచి ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. మరో ఎనిమిది మందిని సెలబ్రిటీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. అలా ఓనర్స్, టెనంట్స్ అంటూ మొదలైన ఈ సీజన్ ఆసక్తికరమైన టర్న్ లు తీసుకుని ఫైనల్ గా సీజన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ రేసులో ఐదుగురు టాప్ 5 గా నిలిచారు.

బిగ్ బాస్ సిల్వర్ సూట్ కేస్ తో డీమాన్ పవన్..

అందులో కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, సంజనా ఉన్నారు. ఐతే వీరిలో సంజన, ఇమ్మాన్యుయెల్ టాప్ 5, 4 లుగా ఎలిమినేట్ అయ్యారు. టాప్ 3గా ఉన్న కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్ లకు బిగ్ బాస్ ముందు 5 లక్షలు ఆ తర్వాత 10 నెక్స్ట్ 15 లక్షల ఆఫర్ ఇచ్చాడు. మాస్ మహారాజ్ రవితేజ ద్వారా బిగ్ బాస్ సిల్వర్ సూట్ కేస్ తో ఈ ఆఫర్ తో హౌస్ లోకి పంపించాడు. ఐతే డీమాన్ పవన్ తను ఎలాగు థర్డ్ పొజిషన్ అని డిసైడ్ అయ్యి ఆ 15 లక్షల సిల్వర్ సూట్ కేస్ తో బయటకు వచ్చాడు.

ఇక కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి ఇద్దరు టాప్ 2 గా నిలిచారు. బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్ లోకి వెళ్లి వారిద్దరిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. హౌస్ లోపలికి వెళ్లిన నాగార్జున తనూజ, కళ్యాణ్ లకు 20 లక్షల ఆఫర్ ఇచ్చాడు. కానీ వాళ్లిద్దరు ఎవరు కూడా ఆ ఆఫర్ తీసుకోలేదు. ఫైనల్ గా స్టేజ్ మీద బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా కామనర్ కళ్యాణ్ పడాలని అనౌన్స్ చేశారు నాగార్జున.

తనూజ సీజన్ 9 విన్నర్ అని ఒక ఫేక్ న్యూస్..

బిగ్ బాస్ సీజన్ 9కి ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల అగ్నిపరీక్ష ద్వారా వచ్చాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఆరుగురిలో ఇద్దరు కళ్యాణ్ టైటిల్ విన్నర్ కాగా డీమాన్ పవన్ టాప్ 3 గా నిలిచాడు. డీమాన్ 15 లక్షల క్యాష్ తో ఎగ్జిట్ ఐతే.. కళ్యాణ్ పడాలకు 35 లక్షల క్యాష్ ప్రైజ్ ఇంకా టాటా విక్టోరియస్ ఎస్.యు.వి కారు ఇంకా రోఫ్ట్ నుంచి 5 లక్షల ప్రైజ్ మనీ అందించారు.

కామనర్ కళ్యాణ్ ని అతని ఆటతో పాటు బయట అతని సపోర్టర్స్ కూడా బాగా పనిచేశారు. ఐతే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు తనూజ సీజన్ 9 విన్నర్ అని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఐతే తీరా షో స్టార్ట్ అయ్యే టైం కి కళ్యాణ్ విన్నర్ అని మరో న్యూస్ బయటకు వచ్చింది. ఫైనల్ గా ఎవరు విన్ అవుతున్నారు అన్నది ఆడియన్స్ లో కొద్దిపాటి టెన్షన్ ఏర్పడగా ఫైనల్ గా సీజన్ 9 ట్రోఫీని కళ్యాణ్ పడాల లిఫ్ట్ చేసి అతని సపోర్టర్స్ ని హ్యాపీ చేశాడు. ఐతే తన జర్నీలో తనూజ కూడా సపోర్ట్ గా ఉందని మిడిల్ వీక్స్ లో తను లో అయితే ఆమె సపోర్ట్ చేసిందని చెప్పాడు కళ్యాణ్.

Tags:    

Similar News