బిగ్ బాస్ 9.. పాపం సంజనాకి ఇన్ విసిబుల్ పనిష్మెంట్..!

బిగ్ బాస్ సీజన్ 9లో సంజనాకి శనివారం నాడు హోస్ట్ నాగార్జున నుంచి మంచి క్లాస్ పడింది.;

Update: 2025-10-27 05:38 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో సంజనాకి శనివారం నాడు హోస్ట్ నాగార్జున నుంచి మంచి క్లాస్ పడింది. ఆమె తను సరదాగా ఉన్న టైం లో ఏమో కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం హౌస్ లో అందరినీ ఏది పడితే అది అనేస్తుంది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వీడియోస్ చూపించి మరీ ఆమెకు క్లాస్ ఇచ్చారు. ఐతే సంజన అదంతా సరదాకే అని అంటున్నా హౌస్ మెట్స్ దాన్ని అంగీకరించలేదు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో సంజనాకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు.

ఇన్ విసిబుల్ కోట్ వేసుకుని ఎవరితో మాట్లాడకుండా..

తనూజ గోల్డెన్ డైమండ్ గెలిచిన సందర్భంగా ఆమెకు 3 ఆప్షన్స్ ఇచ్చారు నాగార్జున. మొదటిది మాధురిని డైరెక్ట్ నామినేట్ చేయడం.. రెండోది వారం మొత్తం బాత్ రూం క్లీనింగ్.. 3వ ది.. ఇన్ విసిబుల్ కోట్ వేసుకుని ఎవరితో మాట్లాడకుండా ఉండటం. ఈ 3 ఆప్షన్స్ లో తనూజ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేస్తానని చెప్పింది. ఐతే ఆ ఇన్ విసిబుల్ కోర్ట్ ని కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ ఎవరికైనా ఇవ్వాలని అంటారు నాగార్జున.

ఓటింగ్ జరగ్గా సంజనాకి సపోర్ట్ గా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు వేశారు.. అలా సంజనాకి మళ్ళీ టై అవగా కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ మీద ఆ బాధ్యత పెట్టగా సంజనాకి ఆ ఇన్ విసిబుల్ కోట్ వేసి ఆమెను ఎవరితో మాట్లాడకూడదు.. ఈమెతో ఎవరు మాట్లాడ్కూడదని పనిష్ మెంట్ ఇచ్చారు. ఐతే సంజన ఈ విషయంలో చాలా అప్సెట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

హౌస్ లో యాక్టివ్ గా ఉంటున్న సంజన..

టాస్కుల్లో ఏమో కానీ హౌస్ లో యాక్టివ్ గా ఉంటున్న సంజన కొన్ని విషయాల్లో ఆమె బిహేవియర్ హౌస్ మెట్స్ ని కాస్త ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇన్ విసిబుల్ కోట్ తో ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు. మరి ఆమె ఎలా ఈ వారం మొత్తం కనిపిస్తుందో చూడాలి. ఈ పనిష్మెంట్ తో సంజన తప్పకుండా తన వాయిస్ ని కంట్రోల్ చేసుకుంటుందని చెప్పొచ్చు.

హౌస్ లో సంజనాని ఇమ్మాన్యుయెల్ మమ్మీ అంటూ మంచి రిలేషన్ తో వెళ్తున్నారు. ఐతే ఇమ్మాన్యుయెల్ తో తప్ప సంజనా మిగతా అందరు ఏం చెప్పినా తను చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా ప్రవర్తిస్తుంది. లాస్ట్ వీక్ దివ్యాతో పాటు కెప్టెన్ గా ఉన్న సుమన్, గౌరవ్ మీద సంజన ఫైర్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఆమెను ఇన్ విసిబుల్ మోడ్ లో ఉంచాలని ఫిక్స్ అయ్యారు హౌస్ మెట్స్.

Tags:    

Similar News