నటివవుతావా అని ఎగతాళి చేసారు?
బాలీవుడ్ హాట్ లేడీ భూమీ పడ్నేకర్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస విజాయాలతో దూసుకుపోతుంది.;
బాలీవుడ్ హాట్ లేడీ భూమీ పడ్నేకర్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస విజాయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫలితాలే సాధించింది. `భీద్` ..` అఫ్వా` ..` థాం క్యూ ఫర్ కమింగ్` ..`ది లేడీ కిల్లర్`, `భక్షక్` లాంటి విజయాలు ఖాతాలో వేసుకుంది. లైంగిక వేధింపుల నుండి బాలికలను రక్షించే జర్నలిస్ట్ పాత్ర లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. నటిగా ఆమె బాధ్యతను పెంచిన చిత్రంగా నిలిచింది. అలాగే సామాజిక కార్యక్రమాల్లోనూ అమ్మడు చురుకుగా పాల్గొంటుంది.
క్లైమేట్ వారియర్ అండ్ భూమీ పౌండేషన్ ద్వారా పర్యావరణానికి అందిస్తోన్న విశేష సేవలకు గానూ యంగ్ గ్లోబల్ లీడర్ గా భూమీ పడ్నేకర్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. ఆ రకంగా అంతర్జాతీయంగానూ భూమీకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతోంది. ప్లాస్టిక్ నిర్మూలన దిశగానూ నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది. అలాంటి భూమీ పడ్నేకర్ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న విమర్శల గురించి తాజాగా రివీల్ చేసింది.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొందరు తనను నటివి అవుతావా? అని ఎగతాళి చేసారుట. ముఖం అద్దంలో చూసుకోమని వెక్కిరించే వారుట. ఆ విమర్శలు..వెక్కిరింపులనే తన విజయానికి సోపానాలుగా మార్చుకున్నట్లు తెలిపింది. ఎవరైనా అలా విమర్శిస్తే వాటిని సవాల్ గా తీసుకునే అలవాటు చిన్న నాటి నుంచి ఉందని తెలిపింది. అది చేయలేవు..ఇది చేయలేవు అంటే వాటిని సాధించి చూపించడం స్కూల్ డేస్ నుంచే అలవాటుగా మారిందంది.
తాను అనుకున్నట్లే ఫిల్మ్ స్టూడియోల కాస్టింగ్ విభాగంలోకి ముందుగా అడుగు పెట్టినట్లు గుర్తు చేసుకుంది. అక్కడకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయాణంలో తనకు దేవుడు మాత్రమే అండగా ఉన్నాడు అంది. `ధమ్ లగా కే హైసా` చిత్రంలో నటించడం గొప్ప కలగా, అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భూమీ పడ్నేకర్ బాలీవుడ్ లో ఇంకొన్ని చిత్రాలకు సైన్ చేసింది. వాటి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే `మేరీ హాస్బెండ్ కీ బివీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు.