మెగా మూవీ భీమ్స్ బాధ్యత పెద్దదే..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో వచ్చిన సినిమా మాస్ జాతర. మాస్ రాజా ఫ్యాన్స్ ఓకే కానీ కామన్ ఆడియన్స్ మాత్రం రవితేజ రెగ్యులర్ మాస్ సినిమాలానే ఉందని అంటున్నారు.;

Update: 2025-11-04 13:30 GMT

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో వచ్చిన సినిమా మాస్ జాతర. మాస్ రాజా ఫ్యాన్స్ ఓకే కానీ కామన్ ఆడియన్స్ మాత్రం రవితేజ రెగ్యులర్ మాస్ సినిమాలానే ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కొంత ఇంపాక్ట్ చూపించాడు కానీ రిజల్ట్ మాత్రం అతన్ని ఖుషి చేయలేదు. ఐతే మెగాస్టార్ చిరంజీవి తో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ కి భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

చిరంజీవి సినిమా ఛాన్స్ అంటే అది మామూలు విషయం..

భీమ్స్ కి వచ్చిన అతి పెద్ద ఛాన్స్ ఇది. ఎందుకంటే చిరంజీవి సినిమా ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ భీమ్స్ చిరంజీవికి వీరాభిమాని అని తెలిసిందే. అందుకే తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తున్నాడు భీమ్స్ . అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పనిచేశాడు కాబట్టి చిరు సినిమాకు అతనే కావాలని చిరంజీవిని పట్టుబట్టి మరీ ఒప్పించాడు అనిల్ రావిపూడి.

ఐతే ఈ సినిమా మ్యూజిక్ విషయంలో భీమ్స్ చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి సినిమా పాట హిట్టైతే ఆ రీచ్ వేరేలా ఉంటుంది. అంతేకాదు ఆయన గ్రేస్ కి తగినట్టుగా మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే భీమ్స్ సిసిరోలియో ఈ బాధ్యత అంతా తన మీద వేసుకుని మెగాస్టార్ కి అదిరిపోయే ఆల్బం ఇస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్ తో వింటేజ్ చిరు మ్యూజిక్ వాడిన భీమ్స్ నెక్స్ట్ మీసాల పిల్లతో అదరగొట్టేశాడు.

భీమ్స్ తన డ్యూటీ పర్ఫెక్ట్ గా..

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎలా అయితే గోదారి గట్టు మీద సాంగ్ పుష్ ఇచ్చిందో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాకు మీసాల పిల్ల సాంగ్ క్రేజ్ తెచ్చింది. ఈ సాంగ్ తోనే భీమ్స్ తన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది. తప్పకుండా చిరు సినిమాకు భీంస్ మ్యూజిక్ అసెట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా తర్వాత భీమ్స్ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అదరగొట్టేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

భీమ్స్ కూడా చిరంజీవి సినిమాకు తన సూపర్ కంపోజిషన్ తో మెగా ఫ్యాన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. చిరు సినిమా టెస్ట్ పాస్ ఐతే మాత్రం అనిల్ రావిపూడి అన్ని సినిమాల్లో అతన్ని రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. తెలుగు స్టార్ సినిమాల్లో మ్యూజిక్ అంటే దేవి శ్రీ ప్రసాద్, థమన్ పేర్లు మాత్రమే ముందు వినిపిస్తాయి. రాజమౌళి సినిమాలకు కీరవాణి ఫిక్స్ అయ్యాడు. సో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ భీంస్ అఫ్కోర్స్ ఆల్రెడీ హిట్ ఫాం లో పాత వాడయ్యాడు కాబట్టి కచ్చితంగా అతనికి ఈ మెగా మూవీ మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News