మరింత ఇంప్రెస్సివ్ గా మూడో విజ్ఞప్తి
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టి అందులో భాగంగా రెండు పాటలను కూడా రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.;
మాస్ మహారాజా రవితేజ హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రవితేజ హిట్ అందుకుని చాలా సినిమాలవుతుంది. ధమాకా తర్వాత రవితేజకు ఇప్పటివరకు హిట్ పడింది లేదు. అయినప్పటికీ వాటినేమీ పట్టించుకోకుండా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టి కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు.
సంక్రాంతికి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి
రీసెంట్ గా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి మరోసారి ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన రవితేజ, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుండగా 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టి అందులో భాగంగా రెండు పాటలను కూడా రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తూ చిత్ర యూనిట్ మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. అద్దం ముందు అంటూ సాగే ఈ థర్డ్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
రొమాంటిక్ లవ్ సాంగ్ గా వచ్చిన ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం ఎంతో ప్రత్యేకంగా నిలవగా, శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలన్ ఈ సాంగ్ ను ఆలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్యూన్, దానికి తగ్గట్టు సాంగ్ ను కొరియోగ్రఫీ చేసిన విధానం, ఆ లొకేషన్స్ సాంగ్స్ ను మరింత స్పెషల్ గా నిలిపాయి. ఈ సినిమాతో అయినా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని భర్త మహాశయులకు విజ్ఞప్తి పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి మాస్ మహారాజా ఆశలు ఈసారైనా ఫలిస్తాయో లేదో చూడాలి.