పిక్‌టాక్ : బచ్చన్ బ్యూటీ కవ్వింపులకు ఫిదా
తాజాగా మరోసారి ఇన్‌స్టాలో భాగ్యశ్రీ బోర్సే తన కవ్వించే చూపులతో అందమైన ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్‌ను ఫిదా చేసింది.;
పూణేకి చెందిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో సెటిల్ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. నటిగా, మోడల్‌గా కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పైగా సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్రను ప్రాముఖ్యత లేకుండా దర్శకుడు డిజైన్ చేశాడు. అయినా కూడా తన అందంతో భాగ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ అందంతో టాలీవుడ్‌లో మరో అవకాశం దక్కించుకుంది. ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన భాగ్యశ్రీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందిన కింగ్‌డమ్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాలోనూ భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. ఇంకా చర్చల దశలోనే ఆ సినిమా ఉందని తెలుస్తోంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఈ అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. కింగ్‌డమ్ సినిమా హిట్ అయి, అందులో ఈమె పాత్రకు గుర్తింపు లభిస్తే తప్పకుండా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా ఈ అమ్మడు మారడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఇన్‌స్టాలో భాగ్యశ్రీ బోర్సే తన కవ్వించే చూపులతో అందమైన ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్‌ను ఫిదా చేసింది. బ్లూ డిజైనర్ ఔట్ ఫిట్‌లో భాగ్యశ్రీ మోడల్‌గా కెమెరాకు ఫోజ్‌లు ఇచ్చిన విధానం, కెమెరా వైపు కవ్వించే విధంగా చూడటంతో ఫోటోలకు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత అందంగా ఉన్న భాగ్యశ్రీ కి ఒక్క సాలిడ్ హిట్ పడితే ఆమెను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని, ఆమెను ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా చూడబోతున్నామని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న భాగ్యశ్రీ కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌తో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీలోనూ పెద్ద సినిమాల్లో చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు అంటున్నారు.
హిందీ చిత్రం యారియాన్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడికి మొదటి సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయితే మోడల్‌గా పలు ప్రాజెక్ట్‌లు చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దాంతో మిస్టర్ బచ్చన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ ఈమెకు నటించే అవకాశాలు దక్కాయి. నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. ఇండియాలో బిజినెస్‌మేనేజ్మెంట్ చేసింది. మోడలింగ్ పై ఆసక్తితో ఒక ఎజెన్సీలో జాయిన్ అయ్యి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఈమె ముఖ్యంగా క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది.