• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరి.. ఇంకా చాలా...

భగవంత్ కేసరి.. ఇంకా చాలా ఉన్నాయట

| ట్రైలర్ సాంపిల్ మాత్రమే అని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ మూవీలో ఉంటాయని అన్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-11 04:28 GMT

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. మొదటి సారిగా బాలయ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేస్తున్నాడు. అతని సంభాషణలు అన్ని కూడా తెలంగాణ స్లాంగ్ లోనే ఉన్నాయి. ట్రైలర్ తోనే ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. రాయలసీమ, ఆంధ్రా నేపథ్యంలో బాలయ్య బీభత్సం చూసిన ఆడియన్స్ కి ఇప్పుడు తెలంగాణలో భగవంత్ కేసరి విశ్వరూపం చూపించబోతున్నారంట.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ అయితే బలమైన కూతురు సెంటిమెంట్ తో పాటు దానిచుట్టూ వేసుకున్న యాక్షన్ ప్యాక్డ్ కథాంశం సినిమాని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళేలా ఉంది. అయితే ట్రైలర్ లో చూపించని చాలా అంశాలు ఇంకా సినిమాలో ఉన్నాయంట. ట్రైలర్ సాంపిల్ మాత్రమే అని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ మూవీలో ఉంటాయని అన్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట ప్రకారం చిత్రంలో బాలయ్య వింటేజ్ లుక్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందంట. ఆ క్యారెక్టర్ నేపథ్యంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా మూవీకి బలంగా ఉంటాయని చర్చించుకుంటున్నారు. అలాగే బాలకృష్ణ ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి రీమేక్ చేసారంట. ఈ సాంగ్ కూడా ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తుందంట.

ముఖ్యంగా బాలయ్యకి సంబందించిన పవర్ ఫుల్ సీక్వెన్స్ మూవీలో నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని తెలుస్తోంది. కచ్చితంగా సినిమాలో బాలయ్య స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ కూడా కావాల్సినంత ఉంటుందంట. ఆ కామెడీ సీక్వెన్స్ ని ట్రైలర్ లో కావాలని 'దర్శకుడు రివీల్ చేయలేదని తెలుస్తోంది.

అక్టోబర్19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. చిత్రంలో శ్రీలీల కూతురుగా కథలో కీలకమైన పాత్రనే చేస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Bhagavantkesari 
  • Balakrishna 
  • Sreeleela 
  • Kajal 
  • Anilravipudi 
  • Movie 
  • Trailer 

Similar News

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

Copyright @2026

Powered by Blink CMS