బండ్ల గణేష్ దీపావళి ధమాకా.. తారలంతా ఒకేచోట!

పండగ వచ్చిందంటే చాలు, సినీ తారల ఇళ్లలో సంబరాలు స్పెషల్ వైబ్ ని తీసుకువస్తాయి. ముఖ్యంగా దీపావళికి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పార్టీలు జరగడం సర్వసాధారణం.;

Update: 2025-10-18 13:10 GMT

పండగ వచ్చిందంటే చాలు, సినీ తారల ఇళ్లలో సంబరాలు స్పెషల్ వైబ్ ని తీసుకువస్తాయి. ముఖ్యంగా దీపావళికి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పార్టీలు జరగడం సర్వసాధారణం. అగ్ర హీరోల నుంచి నిర్మాతల వరకు అందరూ తమ ఆత్మీయుల కోసం స్పెషల్ పార్టీలు ఇస్తుంటారు. ఈ పార్టీలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఇండస్ట్రీలోని వారి కనెక్షన్ ను మరింత స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

​ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇప్పుడు అలాంటి ఓ గ్రాండ్ పార్టీ గురించే మాట్లాడుకుంటోంది. ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ ఒకేచోటకు చేర్చి, ఓ బ్లాక్‌బస్టర్ నిర్మాత ఇస్తున్న ఈ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయనెవరో కాదు, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బండ్ల గణేష్. ఆయన దీపావళి వేడుకలు అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హోమ్ టౌన్ షాద్ నగర్ లో కూడా పాటసులు ఆ ఏరియా మొత్తం వినిపించేలా బ్లాస్ట్ చేస్తారు

ఇక అసలు విషయంలోకి వస్తే.. ​ఈ రోజు (శనివారం) రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో బండ్ల గణేష్ సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఓ భారీ దీపావళి పార్టీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం. దీంతో ఈ పార్టీకి ఒక్కసారిగా మరింత కళ వచ్చేసింది.

​మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు యంగ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, అలాగే పలువురు బడా రాజకీయ నేతలు కూడా ఈ పార్టీకి హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో బండ్ల గణేష్ ఇంట ఇవాళ రాత్రి తారల తళుకులు, రాజకీయ నాయకుల హంగామా ఒకేసారి కనిపించనుంది. ప్రస్తుతం అందరి దృష్టీ ఈ పార్టీపైనే ఉంది.

​ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరోలు పండగను ఎలా జరుపుకుంటున్నారో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తే, సోషల్ మీడియాలో కచ్చితంగా ట్రెండ్ అవ్వడం ఖాయం. ​మొత్తం మీద, బండ్ల గణేష్ తనదైన స్టైల్‌లో దీపావళి వేడుకలను మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు. మరి ఈ పార్టీకి మొత్తంగా ఎంతమంది వస్తారో చూడాలి.

Tags:    

Similar News