ప్రకాష్ రాజ్ పై మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా చలామణి అవుతున్న బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిపై సోషల్ మీడియా ద్వారా విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు..ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసుకొని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేస్తుంటే.. దీంతో మరోసారి ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.
ప్రకాష్ రాజ్ పై మండిపాటు.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్..
తాజాగా బండ్ల గణేష్ తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా.. "ఒరేయ్.. నీకెందుకురా? ప్రతి దాంట్లో వేలు పెడుతున్నావ్.. అసలు నువ్వు ఎవరివి? తమిళోడివా..తెలుగోడివా.. కన్నడోడివా.. నీ ఊరు ఏది? నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో.. ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా? లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే.. ఏ విషయం వచ్చినా నువ్వే.. నీ జీవితంలో చేయడానికి ఇంతకంటే పనేమీ లేకపోతే అది చూసుకో.. కానీ అందరి విషయాలలో తల దూర్చే ఏదో దూరపు హీరోలా ప్రవర్తించకు.. ముందు నీ చిరునామా నువ్వే తెలుసుకో.. ఆ తర్వాతే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు" అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సెటైర్..
బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి ఈ రేంజ్ లో కౌంటర్ ఇవ్వడానికి అసలు కారణం ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని, స్వయంగా తానే తిరుగుతానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇన్ డైరెక్టుగా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.. "మీరు వస్తామంటే..మేము వద్దంటామా.. రండి దొర.. కానీ వచ్చేముందు ఉత్తిత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్ గా వస్తున్నారా ? అనేది మాకు చెప్పి రండి " అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఇది చూసిన నెటజన్స్ మాత్రం ప్రకాష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడు అంటూ కామెంట్స్ చేశారు
ఈ నేపథ్యంలోనే ఈ విషయంపైనే బండ్ల గణేష్ కూడా మండిపడుతూ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేయడంతోనే బండ్ల గణేష్ ఈ రేంజ్ లో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.