బాల‌య్య మాస్ ఇమేజ్ కి జైల‌ర్ తోడైతే!

దీనికి తోడు చేస్తోన్న సినిమాలేవి స‌రిగ్గా ఆడ‌టం లేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బోయ‌పాటి ఎంట్రీ ఇచ్చి బాల‌య్య కు కొత్త ఇమేజ్ ను ఆపాదించాడు.;

Update: 2025-06-26 14:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ మాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో రాయ‌ల‌సీమ స్టోరీలు.. ఆ త‌ర్వాత బోయ‌పాటి స్టోరీలు బాల‌య్య‌ను అలా పైకి లేపాయి. ఆ రెండు జాన‌ర్ చిత్రాలు బాల య్య కెరీర్ కు కొత్త మ‌లుపు లాంటివి. బాల‌య్య కు మాస్ ఇమేజ్ ని సుస్థిరం చేయండంలో ఆ జాన‌ర్లు కీల‌క పాత్ర పోషించాయి. సీమ బ్యాక్ డ్రాప్ సినిమాల త‌ర్వాత బాల‌య్య సినిమాల రోటీన్ గా ఉన్నాయ‌నే విమ‌ర్శ ఎక్కువైంది.

దీనికి తోడు చేస్తోన్న సినిమాలేవి స‌రిగ్గా ఆడ‌టం లేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బోయ‌పాటి ఎంట్రీ ఇచ్చి బాల‌య్య కు కొత్త ఇమేజ్ ను ఆపాదించాడు. బాల‌య్య ను ఎలా చూపించాలో విజువ‌లైజ్ చేసుకుని దాన్ని ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేసి స‌క్సెస్ అయ్యాడు. అప్ప‌టి నుంచి అదే ట్రెండ్ కొన‌సాగుతుంది. అయితే ఇంత‌టి మాస్ ఇమేజ్ ఉన్న బాల‌య్య‌కు నెల్స‌న్ దిలీప్ కుమార్ లాంటి ఎలివేటెడ్ డైరెక్ట‌ర్ తోడైతే? ఆ ఎలివేష‌న్ అన్న‌ది పీక్స్ కు చేరుతుంది.

అందులో ఎలాంటి డౌట్ లేదు. `జైల‌ర్` లో సూప‌ర్ స్టార్ ని ర‌జ‌నీకాంత్ ని ఏ రేంజ్ లో చూపించాడో తెలి సిందే. అందుకే ర‌జ‌నీ మెచ్చి మ‌రీ 'జైల‌ర్ 2' చేస్తున్నారు. ఇందులో బాల‌య్య కూడా ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే ఉన్న ప‌ళంగా నెల్స‌న్ బాల‌య్య తో ఓ భారీ యాక్ష‌న్ చిత్రం చేయాల‌న్న‌ది అభిమానుల కోరిక‌. నెల్స‌న్ విజ‌న్ లో బాల‌య్య ను చూడాల‌ని ఫ్యాన్స్ బ‌లంగా కోరుకుంటున్నారు.

బాల‌య్య మాస్ ఇమేజ్ కి నెల్స‌న్ ని ప‌ర్పెక్ట్ డైరెక్ట‌ర్ గా భావిస్తున్నారు. మ‌రి ఇందుల‌కు బాల‌య్య సిద్దంగా ఉన్నారా? నెల్స‌న్ ఏమంటాడో చూడాలి. ప్ర‌స్తుతం బాలయ్య షెడ్యూల్ అయితే బిజీగా ఉంది. `అఖండ‌2` పూర్త‌యిన త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తారు. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి వ‌చ్చే ఏడాది మిడ్ కు వ‌చ్చే అవకాశం ఉంది. ఈలోగా నెల్స‌న్ టచ్ లోకి వ‌స్తే తిరుగుండ‌దు.

Tags:    

Similar News