నిజ‌మా.. బాల‌య్య‌, కొర‌టాల సినిమా ఆగిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాను కొన్ని నెల‌ల కింద‌ట ఆర్భాటంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-18 04:56 GMT

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాను కొన్ని నెల‌ల కింద‌ట ఆర్భాటంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దేవ‌ర నిర్మాత‌, కొర‌టాల మిత్రుడు మిక్కిలినేని సుధాక‌ర్‌తో క‌లిసి ద‌స‌రా, ప్యార‌డైజ్ చిత్రాల ప్రొడ్యూస‌ర్ సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్ప‌టికే సెట్స్ మీదికి వెళ్లాల్సిన ఈ చిత్రం కొన్ని కార‌ణాల‌తో ఆల‌స్య‌మైంది.

బాల‌య్య గాయ‌ప‌డి విశ్రాంతిలో ఉండ‌డ‌మే అందుక్కార‌ణంగా భావిస్తున్నారు. ఐతే ఉన్న‌ట్లుండి ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన‌ట్లుగా గ‌త రెండు రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సోమ‌వారం ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలోనే కాక మీడియాల‌నూ వార్త‌లు వ‌చ్చాయి.

బాల‌య్య‌, కొర‌టాల సినిమా మేక‌ర్స్ ఆల‌స్యం చేయ‌కుండా ఈ వార్త‌ల‌పై స్పందించారు. ఈ సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని, క్యాన్సిల్ అనేది నిరాధార వార్త అని.. దీన్ని న‌మ్మొద్ద‌ని.. ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేయొద్ద‌ని మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చింది టీమ్. దీంతో ఊహాగానాల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది.

ఈ సినిమా బాల‌య్య కెరీర్లో రికార్డు బ‌డ్జెట్‌తో తీయ‌బోతున్న‌ట్లు ప్రారంభోత్స‌వం రోజే మేక‌ర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు రూ.170 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌ది ప్రాథ‌మిక అంచ‌నా. సినిమా పూర్త‌య్యే స‌మ‌యానికి బ‌డ్జెట్ రూ.200 కోట్లు చేరినా ఆశ్చ‌ర్యం లేదు. ఐతే అంత బ‌డ్జెట్ పెట్టి, బిజినెస్ వ‌ర్కవుట్ చేయ‌డం క‌ష్ట‌మ‌న్న ఉద్దేశంతోనే సినిమాను ఆపేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రి టీం ఈ వార్త‌ల్ని ఖండించిన నేప‌థ్యంలో బ‌డ్జెట్ విష‌యంలో ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో చూడాలి. అంత ఖ‌ర్చు పెట్టి రిక‌వ‌ర్ చేసేలా ప్లాన్ చేస్తారా.. లేక బ‌డ్జెట్ త‌గ్గించుకుని ముందుకు వెళ్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రం. గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య చేస్తున్న చిత్రానికి కూడా ముందు అనుకున్న క‌థ‌, బ‌డ్జెట్ వేరు. కానీ ఆ చారిత్ర‌క‌ క‌థ‌తో, అంత ఖ‌ర్చు పెట్టి సినిమా తీస్తే క‌ష్ట‌మ‌ని భావించి.. త‌ర్వాత స్టోరీ మార్చుకున్నారు.

Tags:    

Similar News