ఉప్పల్ బాలు కామెంట్స్ పై నవదీప్ అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ఘనంగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.

Update: 2026-08-18 04:56 GMT

బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ఘనంగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు సామాన్యులను హౌస్ లోకి పంపించడానికి వారి ఎలిజిబులిటీని టెస్ట్ చేయడానికి అగ్నిపరీక్ష అనే ఒక కాన్సెప్ట్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో నెగ్గిన సామాన్యులను ఒక 6 మందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి పంపిస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆగస్టు 15వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభమైంది.ఇప్పటికే సామాన్యుల నుంచి సుమారుగా 25 వేలకు పైగా దరఖాస్తులు రాగా.. అందులో 70 మందిని ఎంపిక చేయగా.. ఆ 70 మందికి అగ్నిపరీక్షలో వారి బలాబలాలను పరీక్షించి అందులో 15 మందిని ఎంపిక చేసి, స్టేజ్ పైకి పంపిస్తారు. వారిలో ఆరుగురిని మాత్రమే హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం.

ఇక అలా అగ్నిపరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాలు కూడా ఒకరు. పలు రౌండ్ల తరువాత ఉప్పల్ బాలు ఎంపికయ్యారు. అయితే ఉప్పల్ బాలు స్టేజ్ పైకి రాగానే నీది ఎకిలి వీడియోలు కదా.. అలాంటి వీడియోలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నవదీప్ ఆయనను అవమానించారని, మరొకవైపు బిందు మాధవి కూడా మీరు ట్రాన్స్ కదా అంటూ చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అలాంటి వీడియోలు ఎందుకు పనికిరావు అంటూ నవదీప్ ఉప్పల్ బాలును రిజెక్ట్ చేశారు. దీంతో బయటకు వచ్చిన ఉప్పల్ బాలు ఎమోషనల్ అవుతూ నవదీప్ పై ఒక రేంజ్ లో శాపనార్థాలు పెట్టారు.

పైగా తాను ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం నవదీప్ అంటూ మరో వీడియో కూడా విడుదల చేశారు. దీంతో ఎట్టకేలకు నవదీప్ స్పందించారు. తాజాగా ఆయన ఒక వీడియోని విడుదల చేస్తూ.. "బిగ్ బాస్ అనే ఒక మినీ సైజ్ సొసైటీ లోకి రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో వంద రోజులు బ్రతుకుతున్నప్పుడు ఎవరెవరో ఏదో అంటారు. అలా అన్నప్పుడు ఆ మాటలని ఎలా తీసుకుంటాం.. మనం ఎలా రియాక్ట్ అవుతాం.. ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాము.. అనేది మెయిన్ పాయింట్. దానికి నిర్వహించే టెస్టే ఈ అగ్నిపరీక్ష .

మాకు కంటెస్టెంట్స్ కేటాయిస్తారు. ఇంటర్నెట్లో సాధారణంగా ఎదురయ్యే నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ని మేము వాళ్లపై ఉపయోగిస్తాము. వాటిని వాళ్ళు తట్టుకొని ఎలా ముందుకు వెళ్తారు అనేది ఈ అగ్ని పరీక్ష షో యొక్క కాన్సెప్ట్. 100 రోజులపాటు ఒక మినీ సొసైటీలో రకరకాల ఎమోషన్స్ ను తట్టుకోగలరా ? లేదా? అని చూసిన తర్వాత వాళ్లు తట్టుకుంటారు అనిపిస్తేనే మేము హౌస్ లోకి పంపుతాము. దయచేసి ఈ ఫార్మాట్ ను అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమాజానికి ఏం సందేశం ఇస్తావు నువ్వు అని , నాలాంటోళ్లు ఎంతమంది ఎలా మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నవ్వుతూ వెళ్లే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా ? లేకపోతే బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? అనేది నీ ఇష్టం. హార్రర్ సినిమాకు వచ్చి భయపెట్టొద్దంటే ఎలా? ఎన్ని తిట్టినా సరే భరించే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.. అలా ఉంటేనే రండి లేకపోతే దయచేసి అగ్నిపరీక్షకు రావద్దు.." అంటూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ నవదీప్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Tags:    

Similar News