బాలయ్య కొత్త మూవీ.. దామోదర రాజనర్సింహ టైటిల్ తో!
అదే సమయంలో బాలకృష్ణ తాజాగా క్రేజీ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.;
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస మూవీ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సినీ ప్రియులను, అభిమానులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు అఖండ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొంతకాలం క్రితం అఖండ సీక్వెల్ షూటింగ్ ప్రారంభవ్వగా.. ఇప్పుడు శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. వరుస షెడ్యూళ్లతో సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేస్తామని ఎప్పుడో మేకర్స్ ప్రకటించగా, సినిమా కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు, సినీ ప్రియులు. అయితే తన అప్ కమింగ్ సినిమాలపై కూడా బాలయ్య ఫోకస్ పెడుతున్నారు. పలు భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా రానున్నాయని టాక్.
అదే సమయంలో బాలకృష్ణ తాజాగా క్రేజీ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పలు వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఆ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ సమయంలో మాట్లాడిన బాలయ్య.. తన ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ సమర సింహా రెడ్డి అని తెలిపారు. ఆ తర్వాత దామోదర రాజ నర్సింహ టైటిల్ తో సినిమా తీద్దామనుకుంటున్నట్లు చెప్పారు. రాజ సింహ కాదని.. దబిడి దిబిడి రాజ సింహ అంటూ ఫుల్ గా అందరినీ నవ్వించారు.
అయితే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి బాలయ్య ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసందే. దాని ద్వారా ఎంతో మంది రోగులకు ప్రాణం పోస్తున్నారు. క్వాలిటీ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు. ఇప్పుడు ఆస్పత్రి 25వ వార్షికోత్సవ వేడుకలో.. తన మనసులో మాటను బయట పెట్టారు. మరి దామోదర రాజనర్సింహ పేరుతో బాలయ్య మూవీ ఎప్పుడు చేస్తారో అంతా వేచి చూడాలి.