అఖండ2.. అందరి కళ్లూ దానిపైనే!
నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వినగానే మాస్ ఆడియన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది.;
నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వినగానే మాస్ ఆడియన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. స్పెషల్ డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటూ మాస్ ను విపరీతంగా ఆకట్టుకోవడం బాలయ్య స్పెషాలిటీ. అలాంటి బాలయ్య ఇప్పుడు మరోసారి తన పవర్ ను చూపించడానికి అఖండ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
అఖండతో రికార్డులు సృష్టించిన బాలయ్య
ఆల్రెడీ అఖండ సినిమాతో రికార్డులు సృష్టించిన బాలయ్య- బోయపాటి కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. మొదటి భాగం మాదిరిగానే ఈ సీక్వెల్ కు కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగాయి. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ ను పెంచగా, అఖండ తాండవం కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.
తాండవం సాంగ్ పైనే అందరి చూపు
ఇలాంటి భారీ అంచనాల మధ్య ఇప్పుడు మేకర్స్ అఖండ2 ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నారు. అఖండ2 నుంచి తాండవం అనే సాంగ్ ను మేకర్స్ ఇవాళ సాయంత్రం రిలీజ్ చేయనుండగా ఇప్పుడందరి చూపూ దాని పైనే ఉంది. అఖండ2 తాండవం ప్రమోషన్స్ ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ అందులో భాగంగానే ఫస్ట్ సాంగ్ లాంచ్ ను ముంబైలో రిలీజ్ చేస్తున్నారు.
మ్యూజిక్ తో స్పీకర్లు పగలకొట్టిన తమన్
ఆల్రెడీ ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో రిలీజవగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ మొదటి సినిమాకు సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. అఖండ మూవీతో స్పీకర్లు పగిలిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్, ఇప్పుడు అఖండ2 కోసం ఇంకా భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే తమన్ ఫస్ట్ సాంగ్ కోసం ఏకంగా శంకర్ మహదేవన్ మరియు ఖైలాష్ ఖేర్ లాంటి టాప్ సింగర్లను రంగంలోకి దింపడంతో అందరి కళ్లూ ఈ పాట పైనే ఉన్నాయి.
ప్రోమో వింటుంటే మాత్రం సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తుండటంతో ఇప్పుడందరి దృష్టి ఈ ఫస్ట్ సింగిల్ పైనే ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లు గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.