నార్త్ లో బాలయ్య 'తాండవం'.. ఇది నెవ్వర్ బిఫోర్ స్కెచ్
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సాక్షాత్తు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే బాలయ్య పక్కన యోగిని స్టేజ్ పై చూడొచ్చు.;
ఇప్పుడు టాలీవుడ్ చూపు మొత్తం పాన్ ఇండియా మార్కెట్ పైనే ఉంది. మన యంగ్ హీరోలు అక్కడ జెండా పాతేస్తుంటే, సీనియర్ స్టార్స్ మాత్రం ఇంకా ఆ మ్యాజిక్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం 'సైరా' కోసం గట్టిగానే కష్టపడ్డా ఆశించిన ఫలితం దక్కలేదు. వెంకీ, నాగ్ వంటి వారు పెద్దగా ఆ వైపు ఫోకస్ పెట్టట్లేదు. కానీ ఇప్పుడు నటసింహం బాలకృష్ణ మాత్రం ఒక రేంజ్ లో నార్త్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం వేసిన ప్లాన్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అవుతోంది.
మామూలుగానే బాలయ్య బోయపాటి కాంబో అంటే మాస్ జాతర. అందులోనూ 'అఖండ' లాంటి డివైన్ హిట్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఈసారి కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా గట్టిగా సౌండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం ఏకంగా దేశంలోని అత్యంత పవర్ ఫుల్ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను టార్గెట్ చేశారు. అక్కడ ఒక భారీ ఈవెంట్ కు ప్లాన్ జరుగుతోంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పొలిటికల్ కోణం కూడా దాగి ఉంది.
అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చూపించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వం, సనాతన ధర్మంపై వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనకు ప్రత్యేకంగా చూపించారట. ఆ కంటెంట్ చూసి యోగి ఇంప్రెస్ అయ్యారని, సినిమా థీమ్ నార్త్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని భావించినట్లు తెలుస్తోంది.
హిందీ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడానికి వారణాసిలో ఒక భారీ ప్రమోషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సాక్షాత్తు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే బాలయ్య పక్కన యోగిని స్టేజ్ పై చూడొచ్చు. అఖండ ఫస్ట్ పార్ట్ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు వచ్చిన క్రేజ్ ను వాడుకుంటూ, ఇప్పుడు యోగి సపోర్ట్ తో 'అఖండ 2'ను అక్కడ నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.
ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి నేటి తరం హీరోలు ఇప్పటికే బాలీవుడ్ లో తమకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ సీనియర్ హీరోల విషయంలో అది ఇంకా సాధ్యం కాలేదు. ఇప్పుడు బాలయ్య ఆ లోటును తీరుస్తారని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. హిందుత్వ బ్యాక్ డ్రాప్, అఘోరా గెటప్ నార్త్ ఆడియెన్స్ సెంటిమెంట్ కు దగ్గరగా ఉంటాయి కాబట్టి, బాలయ్యకు అక్కడ క్లిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
మొత్తానికి బాలయ్య బోయపాటి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం, సీనియర్ హీరోలకు కూడా పాన్ ఇండియా ద్వారాలు తెరుచుకున్నట్లే. యోగి ఆదిత్యనాథ్ ఎంట్రీతోనే సినిమాపై సగం బజ్ వచ్చేస్తుంది. మరి ఈ 'తాండవం' కాశీ వీధుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, బాలయ్య హిందీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తారో చూడాలి.