• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదరగొట్టిన అంజలి.....

అదరగొట్టిన అంజలి.. వేశ్యగా మరో సిరీస్..

| ఇప్పుడు బహిష్కరణ వెబ్ సిరీస్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అంజలి.

By - Tupaki Desk
Update: 2024-07-11 13:17 GMT

తెలుగమ్మాయి అంజలికి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో అలరిస్తోంది. ఓవైపు సినిమాల్లో.. మరోవైపు వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేస్తోంది. షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో 50పైగా ప్రాజెక్టుల్లో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించింది. ఇటీవల విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో వేశ్యగా కనిపించింది. తన యాక్టింగ్ తో అదరగొట్టింది.

ఇప్పుడు బహిష్కరణ వెబ్ సిరీస్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అంజలి. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్న ఈ సిరీస్.. జులై 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ కక్షల నేపథ్యంలో విలేజ్ రివెంజ్ డ్రామా రానున్న ఈ సిరీస్ పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. నెట్టింట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

అయితే బహిష్కరణ సిరీస్ లో కూడా అంజలి వేశ్యగా కనిపించనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. పుష్ప రోల్ లో అంజలి అదరగొట్టేసింది. ఆమె డైలాగ్ డెలివరీ కొత్త గా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా వేశ్యగా కనిపించినా.. రెండింటికీ చాలా వేరియేషన్ చూపించింది. ఏ సీన్ లో ఎలా ఉండాలో.. అలాగే నటించింది. రివెంజ్ తీర్చుకోవడానికి ఎలాంటి పని అయినా చేయడానికి రెడీ అయ్యే మహిళగా ఆకట్టుకుంటోంది.

ఇక ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌డం అనే డైలాగ్‌.. ఆలోచింపజేసేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రతి పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. శక్తివంతులు వర్సెస్ బలహీనులు అన్న కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఉద్వేగభరితంగా సాగుతూ.. సిరీస్ పై ఆసక్తి రేపుతోంది.

అయితే దర్శి(శ్రీ తేజ్) పుష్ప( అంజలి)ని ఇష్టపడి ప్రేమిస్తాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు. అదే సమయంలో శివయ్య(రవీంద్ర విజయ్) పుష్ప మీద కన్నేస్తాడు. అప్పుడు పుష్ప వేశ్య అని తెలిసి.. డబ్బు కోసమే సన్నిహితంగా ఉంటుందని దర్శి అనుకుంటాడు. కానీ ఊరిలో జరిగే దురాగతాలను ఎదుర్కోవడానికి వచ్చానని చెబుతోంది పుష్ప. అసలు పుష్ప అక్కడికి ఎందుకు వచ్చింది? చివరకు ఏం జరిగిందో తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Full View
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Bahishkarana 
  • Trailer 
  • Anjali 
  • MukeshPrajapathi 
  • RavindraVijay 
  • Shritej 
  • AnanyaNagalla 
  • Shanmukh 
  • MahboobBasha 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS