సెలబ్రిటీ పెళ్లిలో చెత్త నుంచి లక్షలు పిండొచ్చని ప్రూవ్ చేసాడు!
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, తన ప్రియుడు ట్రావిస్ జూలై 3న న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు.
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, తన ప్రియుడు ట్రావిస్ జూలై 3న న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను చూడటానికి వేలాది మంది అభిమానులు వేదిక వెలుపల గుమిగూడారు. అయితే ఈ పెళ్లిని వేదిక బయట ఉన్న ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ తన తెలివితేటలతో ఒక వినూత్నమైన బిజినెస్‌గా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
న్యూయార్క్‌కు చెందిన జస్టిన్ గిగ్నాక్ అనే ఆర్టిస్ట్.. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత సెక్యూరిటీ బారియర్ల వెలుపల వీధుల్లో అభిమానులు వదిలేసి వెళ్లిన చెత్త .. అంటే బాటిల్ క్యాప్స్, స్ట్రాస్, సిగరెట్ పీకలు, చివరికి ఒక సింగిల్ ఎయిర్‌పాడ్‌ను కూడా సేకరించాడు. ఆ చెత్తను చిన్న చిన్న పారదర్శక ప్లాస్టిక్ క్యూబ్స్ (డబ్బా)లో ఉంచి.. వాటిపై `JUST&T MARRIED` అనే ప్రత్యేకమైన స్టాంప్ వేసి.. అవి `కళాఖండాలు` అని లేబుల్ చేశాడు.
టేలర్ స్విఫ్ట్ అభిమానులు ఆ పెళ్లి రోజుకు గుర్తుగా ఏదో ఒక జ్ఞాపకాన్ని దాచుకోవాలని ఆరాటపడటంతో.. గిగ్నాక్ ఆ చెత్త క్యూబ్స్‌ను ఆన్‌లైన్‌లో ఒక్కొక్కటి రూ. 2,400 చొప్పున అమ్మకానికి పెట్టాడు. ఆశ్చర్యకరంగా కేవలం 24 గంటల్లోనే మొత్తం 50 క్యూబ్స్ అమ్ముడైపోయాయి. దీని ద్వారా ఆ ఆర్టిస్ట్ ఏకంగా రూ. 1.2 లక్షలు సంపాదించాడు. న్యూయార్క్‌లో జరిగే ఇలాంటి పెద్ద సాంస్కృతిక సంఘటనలను`టైమ్ క్యాప్సూల్స్` లాగా బంధించడం తనకు ఇష్టమని.. తాను కేవలం బయట పబ్లిక్ వీధుల్లోని చెత్తను మాత్రమే సేకరించానని గిగ్నాక్ వివరించాడు.
పెళ్లిలో ఫ్యామిలీ వైబ్స్:
అంతేకాదు.. టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్స్ ల రాయల్ వెడ్డింగ్‌కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ సెలబ్రిటీ వివాహ వేడుకలో ట్రావిస్ కెల్స్ సోదరుడు జేసన్ కెల్స్ కుమార్తెలు వైట్ (6), ఇలియట్ (5), బెన్నెట్ (3), 15 నెలల చిన్నారి ఫిన్లీ ... ఫ్లవర్ గర్ల్స్‌గా వ్యవహరించి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 1000 మంది ప్రముఖ అతిథులు హాజరైన ఈ వేడుకలో ఈ నలుగురు చిన్నారులు వేదిక అంతటా పూల రేకులను చల్లుతూ సందడి చేశారని ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ రిచ్ ఐసెన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులకు అత్యంత ప్రాధాన్యత లభించింది. ట్రావిస్ అన్న జేసన్ కెల్స్ `బెస్ట్ మ్యాన్`గా బాధ్యతలు నిర్వర్తించగా, టేలర్ స్విఫ్ట్ సోదరుడు ఆస్టిన్ స్విఫ్ట్ `మ్యాన్ ఆఫ్ హానర్`గా నిలిచారు. జేసన్ కెల్స్ కుమార్తెలకు టేలర్ స్విఫ్ట్ అంటే మొదటి నుంచే ఎంతో ఇష్టం. పెళ్లికి ముందే ఆమెను తమ అత్తగా (ఆంట్) ఎంతగానో ప్రేమించే ఈ నలుగురు బుజ్జాయిలు.. ఇప్పుడు నేరుగా తమ బాబాయ్ పెళ్లిలోనే ఫ్లవర్ గర్ల్స్‌గా మారి పూల వర్షం కురిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.