రజని తెలుగు మార్కెట్ వద్దనుకున్నారా ?

Update: 2019-05-27 07:09 GMT
సూపర్ స్టార్ రజనికాంత్ కు ఇంతకు ముందు మన స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉండేది. ఆయన సినిమా వస్తోంది అంటే మనవాళ్ళు రీ షెడ్యూల్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు అంతా రివర్స్. గత కొన్నేళ్ళలో చవి చూసిన దారుణ పరాజయాలు రజని మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. కథానాయకుడు -లింగా-కబాలి-కాలా-2.0-పేట ఇలా వరసగా వీటిలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మాతలు గర్వంగా తమకు లాభాలు ఇచ్చిన సినిమాగా చెప్పుకునేది లేనే లేదు.

ఆఖరికి పేట చాలా చీప్ గా 12 కోట్లకు అమ్ముడుపోతే సంక్రాంతి రిలీజ్ లో కనీసం అందులో సగం కూడా షేర్ రూపంలో ఇవ్వలేకపోయింది. 2.0లో గ్రాఫిక్స్ హంగామా ఉన్నా పెట్టుబడుల లెక్కల్లో దానికీ ఇరవై కోట్ల దాకా నష్టం తప్పలేదు. ఇక అంతకు ముందు వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇప్పుడు దర్బార్ వంతు వచ్చింది. వచ్చే పొంగల్ కి డేట్ లాక్ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగులో ఆ సమయానికి విపరీతమైన పోటీ ఉంది.

మహేష్ బాబు-అనిల్ రావిపూడి అల్లు అర్జున్-త్రివిక్రమ్ బాలకృష్ణ-కెఎస్ రవికుమార్ ఇలా స్టార్ హీరోలు ఇప్పటికే కర్చీఫ్ వేశారు. అనూహ్యంగా నాగార్జున బంగార్రాజు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇంత తీవ్రమైన పోటీ ఉండగా దాన్సలు పట్టించుకోకుండా దర్బార్ ను అదే సమయంలో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అంటే తెలుగులో బిజినెస్ పెద్దగా జరగకపోయినా సినిమా ఆడకపోయినా లైట్ తీసుకుందామనే కదా అర్థం. ఇలాగే పేట సంక్రాంతి పోటీలో నలిగిపోయింది. ఇప్పుడు దర్భార్ ని ప్లాన్ చేయడం చూస్తుంటే ఇక్కడ మార్కెట్ కి నీళ్ళు వదిలేసినట్టే కనిపిస్తోంది

   

Tags:    

Similar News