కింగ్ నాగ్ ఆ జానర్ కు 'గుడ్ బై' చెప్పనున్నాడా..??
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేసేది కింగ్ నాగార్జున అని చెప్పాలి. ఎందుకంటే కెరీర్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలనే నమ్ముకోకుండా ఎక్స్పరిమెంటల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తాజాగా వైల్డ్ డాగ్ సినిమా కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలలో ఒకటి. కానీ ఓటిటి రిలీజ్ వద్దనుకొని థియేట్రికల్ రిలీజ్ చేస్తే వైల్డ్ డాగ్ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ అదే సినిమాను ముందుగా అనుకున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తే అసలు ఊహించని రేంజిలో పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు థియేటర్స్ లో ఆడిన సినిమా ఇదేనా అనిపించేలా ఓటిటిలో భారీ సక్సెస్ అందుకుంది వైల్డ్ డాగ్.
అయితే ప్రస్తుతం వైల్డ్ డాగ్ ఫలితం చూసాక నాగ్.. ఇకపై ఎక్స్పరిమెంటల్ సినిమాలకు బ్రేక్ పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నటువంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్. ఎందుకంటే ఇటీవలే కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలాగే ప్రవీణ్ తెరకెక్కించిన 'లెవెన్త్ అవర్' వెబ్ సిరీస్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఇదే తరుణం అనుకొని ప్రవీణ్ సినిమాను హోల్డ్ లో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సినీవర్గాలలో టాక్. తను కూడా కమర్షియల్ నేపథ్యంలో బంగార్రాజు సినిమాను లైన్ లో పెడితే బాగుంటుందనే విధంగా ఆలోచనలో పడినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎలాగో త్వరలో బంగార్రాజు సినిమా స్టార్ట్ చేస్తామని ఇదివరకే చెప్పారు. మరి ఇకపై బంగార్రాజుతో పాటు ప్రవీణ్ మూవీ పట్టాలెక్కుతుందా.. లేక బంగార్రాజు మాత్రమే తెరకేక్కుతుందా అనేది చూడాలి.