హైదరాబాద్ 'క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ సినిమా' గా మారుతుందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణమనడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్నది తెలుగు చిత్రాలే అనడంలో సందేహం లేదు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ ఇతర ఇండస్ట్రీలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు భాష అడ్డంకులను తొలగించిన మన సినిమా వైపు చేస్తోంది.
ఒకప్పుడు మద్రాస్ కేంద్రంగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కి తీసుకురావడానికి అక్కినేని నాగేశ్వరరావు - నందమూరి తారకరామారావు వంటి ఎందరో పెద్దలు కృషి చేసారు.
దీనికి ప్రభుత్వాలు కూడా తగిన సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు అందించడంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో ఎందరో ప్రతిభావంతులైన నటీనటులు సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు ఇండస్ట్రీ అగ్రగామిగా నిలిచింది.
అప్పట్లో సినిమా షూటింగులు చేసుకోడానికి ముంబై - చెన్నై వంటి నగరాల్లో స్టూడియోలు ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ లో అత్యాధునిక హంగులతో వాటిని తలదన్నే స్టూడియోలు ఉన్నాయి. ఎప్పుడూ షూటింగ్స్ తో కళకళలాడుతూ ఉండే ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ - అన్నపూర్ణ స్టూడియోస్ - రామా నాయుడు స్టూడియోస్ వంటి వాటికి భాగ్యనగరం కేంద్రంగా ఉంది.
బాలీవుడ్ - కోలీవుడ్ - శాండిల్ వుడ్.. ఇలా ఏ వుడ్ అయినా ఇప్పుడు సినిమాల షూటింగుల కోసం హైదరాబాద్ ని ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు సాంగ్స్ రికార్డింగ్ కోసం ఏ చెన్నైకో బాబాయికో వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇక్కడే మ్యూజిక్ స్టూడియోలు అందుబాటులో ఉన్నాయి. అలానే డబ్బింగ్ స్టూడియోలు.. సినిమాల్లో గ్రాఫిక్స్ చేయడానికి వీఎఫెక్స్ కంపెనీలు కూడా ఉన్నాయి.
ఇలా సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల పనులు చూసుకోవడానికి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అందుకే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారత సినీ ఇండస్ట్రీకి ఒక సుస్థిరమైన కేంద్రంగా రూపొందుతుందని.. ఫిలిం మేకింగ్ పరంగానూ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సినీ పెద్దలందరూ అండగా ఉంటే తప్పకుండా హైదరాబాద్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతుందనే విశ్వాసం ఉందని అభిప్రాయ పడ్డారు.
హీరో రానా దగ్గుబాటి సైతం ఇండియన్ సినిమాకు హైదరాబాద్ రాజధాని అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని.. దీని కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. మరి రాబోయే రోజుల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి భారతదేశానికి హైదరాబాద్ నగరాన్ని మూవీ క్యాపిటల్ గా మారుస్తారేమో చూడాలి.