• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వచ్చే ఏడాది బన్నీ వారితో...

వచ్చే ఏడాది బన్నీ వారితో పోటీలో నిలిచేనా?

By - Tupaki Desk
Update: 2020-05-27 06:00 GMT
అల్లు అర్జున్‌ ఏ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించి టాప్‌ చిత్రంగా నిలిచింది. విపత్కర పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మరే పెద్ద సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనుక 2020 సంవత్సరంలో బిగ్గెస్ట్‌ చిత్రం అల వైకుంఠపురంలో గా నిలవడం ఖాయం. ఇక వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాదిలో పెద్ద హీరోల సినిమాలు దాదాపుగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చినా కూడా రికార్డులు బద్దలు అయ్యేంతగా వసూళ్లు వచ్చే అవకాశం లేదు. కనుక ఈ ఏడాదిలో సినిమాలు విడుదల కాకపోవడమే బెటర్‌ అనే అభిప్రాయంలో ఉన్నారు. పవన్‌.. మహేష్‌.. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌.. చిరంజీవి.. ప్రభాస్‌ ఇలా హేమా హేమీల మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద వచ్చే ఏడాది ఢీ కొట్టబోతున్నాయి. వీరందరితో పాటు అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

ఈ ఏడాది టాప్‌ చిత్రంగా బన్నీ చిత్రం నిలిచింది. మరి వచ్చే ఏడాది వచ్చే అన్ని సినిమాల పోటీలో టాప్‌ 5 లో అయినా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్‌ రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత స్థానంను పుష్ప దక్కించుకుంటుందనే నమ్మకంను బన్నీ ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ స్థాయిలో సుకుమర్‌ పుష్పను తెరకెక్కిస్తాడా చూడాలి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ మరియు కథ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పుష్ప చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించబోతున్న విషయం తెల్సిందే. పాన్‌ ఇండియా లెవల్‌ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్‌ నటుడిని ఈ చిత్రంలో విలన్‌ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ కు సిద్దం అవుతున్నారు.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa 
  • Allu Arjun Pushpa 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS