అర డజను చిత్రాల్లో ఒక్కటైనా టాలీవుడ్ కు ఊపు తీసుకొస్తుందా..?

Update: 2021-08-05 11:30 GMT
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు మళ్లీ తెరవడంతో టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. 'తిమ్మరసు' 'ఇష్క్‌' సినిమాతో రీ ఓపెన్ అయిన సినిమా హాళ్ల దగ్గర ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడిన జనాలు థియేటర్లకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారని అర్థం అవుతోంది. ఫస్ట్ వేవ్ సమయంలో సెకండ్ వేవ్ వస్తుందని తెలియకపోవడంతో అప్పుడు సినిమాలను బాగానే ఆదరించారు. కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందనే భయం ఉండటంతో జనాలు థియేటర్లకు రావడం లేదని తెలుస్తోంది.

అంతేకాదు పోయిన శుక్రవారం విడుదలైనవి చిన్న సినిమాలు అవడం కూడా థియేటర్ల వైపు చూడటానికి ఒక కారణంగా చెబుతున్నారు. అయితే వీకెండ్ లో పుంజుకున్న 'తిమ్మరసు' ఓ మోస్తరు వసూళ్ళు రాబడుతుండటం కాస్త ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం మరో అర డజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. 'SR కల్యాణమండపం' 'ముగ్గురు మొనగాళ్ళు' 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' 'మెరిసే మెరిసే' 'మ్యాడ్' 'క్షీర సాగర మధనం' వంటి చిత్రాలు రేపు (ఆగస్ట్ 6) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

అయితే వీటిలో 'SR కల్యాణమండపం EST.1975' చిత్రానికి మినహా మరే సినిమాపై పెద్దగా బజ్ లేదు. 'రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం - 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని సాంగ్స్ జనాలకు బాగా రీచ్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ అంశాలన్నీ మంచి ఓపెనింగ్స్ తెచ్చి పెట్టే అవకాశం ఉంది.

'ఎస్ ఆర్ కల్యాణమండపం' తర్వాత జనాలకి తెలిసిన సినిమాల శ్రీనివాస్ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్ళు'. ట్రైలర్ కాంట్రవర్సీతో 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్రం గురించి కూడా జనాలు చర్చించుకుంటున్నారు. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఈ అర డజను సినిమాల్లో రెండైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడితే.. వచ్చే వారం క్రేజీ మూవీస్ విడుదలలు ఆశించవచ్చు. మరి వీటిలో ఒక్కటైనా టాలీవుడ్ కు ఊపు తీసుకొస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News