ఆ తెలుగమ్మాయి ఈసారైనా టాలీవుడ్ లో పాగా పక్కానా!

Update: 2020-10-20 06:30 GMT
ఐశ్వర్యా  రాజేష్.. తమిళంలో మంచి స్టార్ డమ్ సాధించిన తెలుగమ్మాయి. కోలీవుడ్లో ఆమె ఎప్పుడూ బిజీ నటే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అక్కడ ఆమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి విజయాలు సాధించడంతో పాటు అవార్డులు కూడా కొల్లగొట్టింది. కానీ అందుకు ఆమె తమిళంలో లభిస్తున్న ప్రోత్సాహం తెలుగులో లభించడంలేదు. తెలుగులో చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు.

తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కనా’ సూపర్ హిట్ కాగా దానిని  రీమేక్ చిత్రాల దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ మాత్రం ఐశ్వర్య రాజేష్ కి ఆశించిన ఫలితం దక్కలేదు. సక్సెస్ లో ఉన్న విజయ్ దేవరకొండ తో  ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఓ కీలక పాత్ర చేసినా ఆమె ఫేట్ మారలేదు. ఆమె పాత్రకు పేరొచ్చిన సినిమా మాత్రం విజయవంతం కాలేదు. తెలుగులో ఆమెకు సెకండ్ హీరోయిన్, చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో నటిస్తున్న కొత్త చిత్రాన్ని తెలుగులో కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా పేరు' భూమిక'. ఇది ఐశ్వర్యకు  25వ సినిమా సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వం వహించగా తమిళ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ  ఫస్ట్ లుక్‌  ఇటీవల విడుదల విడుదల చేయగా అది అందర్నీ ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నుంచే పుట్టుకొచ్చిన రూపంతో ఐశ్వర్య రూపం ఆసక్తి కలిగిస్తోంది. తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాతో అయినా తెలుగులో  హిట్టు కొట్టి స్టార్డం  సంపాదిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News