మెగా బ్రదర్స్‌ కి మాత్రమే తెలిసిన సీక్రెట్‌

Update: 2015-08-27 02:17 GMT
మెగా బ్రదర్స్‌ మధ్య సఖ్యత గురించిన టాపిక్‌ ఎప్పటికప్పుడు టాలీవుడ్‌ లో డిష్కసన్‌ పాయింట్‌. ఒకరంటే ఒకరికి గిట్టదు. లోలోన బోలెడంత మదనం నడుస్తూనే ఉంటుందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అన్నయ్య చిరంజీవి నుంచి పవన్‌ దూరంగా ఉంటున్నారు. రాజీకీయాల పరంగానూ విభేధాలున్నాయని చెప్పుకుంటారు. అయితే వ్యక్తిగత విషయాల్లో మేం ఎప్పుడూ కలిసే ఉన్నాం అనే సంకాతాన్ని ఇస్తూ పవన్‌ కల్యాణ్‌ మొన్నటి రోజున మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కనిపించి షాకిచ్చారు.

అన్నయ్యను కాదని పవన్‌ జనసేన పార్టీ పెట్టినప్పుడు, చిరు ఓ మాటన్నారు. పవన్‌ వెనక ఉండి నడిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు! ఈ మాట అప్పట్లో విస్త్రతంగా చర్చల్లోకొచ్చింది? కానీ చిరు పెదవి విప్పనేలేదు. ఆ తర్వాత 'అత్తారింటికి దారేది' రిలీజ్‌ కి ముందు సినిమా ఫుటేజ్‌ లీకేజీ అయ్యింది. అది చేసిందెవరో, చేయించిందెవరో నాకు తెలుసు అంటూ పవన్‌ మరో క్వశ్చన్‌ మార్క్‌ వేశారు. తనంటే గిట్టనివారే ఈ పని చేయించారని పవన్‌ అర్థం వచ్చేలా మాట్లాడాడు.

పలుమార్లు మెగా వేడుకల్లో అసలు 'పవన్‌ అని అరుస్తున్న వారి వెనక ఎవరున్నారో నాకు తెలుసు' అంటూ నాగబాబు ఫైరైన సందర్భాలున్నాయి. అంటే మెగాబ్రదర్స్‌ కు మాత్రమే తెలిసిన ఆ అదృశ్య శక్తులు ఎవరై ఉంటారు? ఇది ఎప్పటికీ ఇలా టాప్‌ సీక్రెట్‌ గా ఉండిపోవాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఎవరో ఒకరు... ప్లీజ్‌ రివీల్‌ సీక్రెట్స్‌ గురూ..!!
Tags:    

Similar News