సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద గెలిచేది ఎవరు..??
కరోనా లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడే సినీ ఇండస్ట్రీ మెల్లగా కోలుకుంటుంది. ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తోంది. అయితే చాలా నెలల తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అవడంతో సినీ అభిమానులలో ఉత్సాహం మొదలైంది. అలాగే సినీ స్టార్స్ లో కూడా కాస్త నవ్వు కనిపిస్తోంది. అయితే ఇటీవల 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విడుదలై సినీ ఇండస్ట్రీలో కాస్త ధైర్యం నింపిందని చెప్పాలి. ఎందుకంటే థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే సందేహాలు తొలిగించింది ఆ సినిమా. ఇక ఇప్పుడు ఒకదాని వెనుక ఒక సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సంక్రాంతి బరిలో ఈసారి భారీ పోరు జరగనుంది. ఎందుకంటే కొత్త సినిమాలతో పాటు ఇదివరకే ఓటిటిలలో విడుదలైన సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.
ఈ క్రమంలో జనవరి 8న డర్టీ హరి థియేటర్ల బాట పడుతుండగా.. ఆ తర్వాత కలర్ ఫొటో జనవరి 12న విడుదల కాబోతుంది. అనంతరం సంక్రాంతి బరిలో నేరుగా థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలు నాలుగు.. వీటిలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మాస్టర్ ఒకటి. ఈ సినిమా డబ్బింగ్ కేటగిరిలోకి వెళ్తుంది. ఈ సినిమా కాకుండా తెలుగు సినిమాలు క్రాక్, అల్లుడు అదుర్స్, రెడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ ఆరు సినిమాల్లో డర్టీ హరి, కలర్ ఫోటో సినిమాలను ఆల్రేడీ ఓటిటి, ఏటిటిల ద్వారా జనాలు చూసేశారు. ఇక దళపతి విజయ్ సినిమాకు జనాలు పరిగెత్తుకొచ్చే రేంజిలో ప్రమోషన్స్ జరగకపోగా.. పోస్టర్లలో విజయ్ ఫేస్ గుర్తు పట్టలేకుండా మాస్టర్ పబ్లిసిటీ జరుగుతుంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ ప్లాప్స్ లో ఉన్నాడు. కాబట్టి భారీ ఓపెనింగ్స్ కష్టమే అనిపిస్తుంది. ఇక బెల్లకొండ శ్రీనివాస్, రామ్ ఇద్దరే చివరిగా రాక్షసుడు, ఇన్మార్ట్ శంకర్ రూపంలో సూపర్ హిట్స్ అందుకున్నారు. వీరిద్దరికీ భారీ ఓపెనింగ్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. కానీ వసూళ్ల పరంగా రామ్ రెడ్ తో దూసుకెళ్తాడేమో చూడాలి..!!