మణిని నమ్మి వెయ్యి కోట్లు పెడతారా ?

Update: 2019-05-06 06:21 GMT
గత కొంత కాలంగా తన స్థాయి విజయానికి దూరంగా ఉన్న మణిరత్నం ఇప్పుడు పోన్నియన్ సెల్వన్ రూపంలో మరోసారి పెద్ద సంచలనానికి తెరతీశారు . దీని గురించి రెండు మూడు నెలల నుంచే మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఇది అసలు మొదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా జోరుగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో మణిరత్నం దీనికి 1000 కోట్ల బడ్జెట్ పెట్టగలిగే నిర్మాత కోసం వెతుకుతున్నారన్న వార్త ఇంకో హాట్ న్యూస్ గా మారింది.

పోన్నియన్ సెల్వన్ భారీ మల్టీ స్టారర్. అందులోనూ చారిత్రాత్మక నేపధ్యం. ఖర్చు మాములుగా ఉండదు. విక్రం-జయం రవి-కార్తి-అమితాబ్ బచ్చన్-మోహన్ బాబు-ఐశ్వర్య రాయ్-కీర్తి సురేష్ ఇలా ఫస్ట్ లిస్టే ఓ రేంజ్ లో ఉంది. ఇది అధికారికంగా ప్రకటించింది కాకపోయినా మణి కాంపౌండ్ నుంచి ప్రచారంలోకి వచ్చిన లీక్డ్ న్యూస్

మణిరత్నం తన మేజిక్ టచ్ ని పూర్తిగా ప్రదర్శించలేని టైంలో ఇంత బడ్జెట్ ని సమకూర్చడం అంటే అంత ఈజీగా జరిగే పని కాదు. పైగా రాజమౌళి తరహలో ఈయనకు నేషనల్ వైడ్ లో భారీ మార్కెట్ లేదు. మణి అంటే నమ్మకమే కానీ మరీ వెయ్యి కోట్లు పోసెంత ధైర్యం చేయడం అంత ఈజీ కాదు.

అందుకే ఇది కార్యరూపం దాల్చడం మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ బాహుబలి తరహలో మార్కెట్ చేసేందుకు విక్రం తప్ప మిగిలిన వారెవరు పెద్దగా ప్రభావితం చూపించే వారు కాదు. సో ఇది షూటింగ్ ప్రారంభమై ఎవరైనా నిర్మాత నేను వెయ్యి కోట్లు పెడుతున్నాను అని చెప్పే దాకా నమ్మలేని పరిస్థితే ఉంది
    
    
    

Tags:    

Similar News