మెగా డైరెక్ట‌ర్ వార‌సుడొస్తున్నాడు?

Update: 2019-05-08 04:51 GMT
స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ప్ర‌స్తుత స‌న్నివేశం గురించి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు.. సెన్సేష‌న‌ల్ హిట్స్ ని తెర‌కెక్కించిన ఈ నిష్ణాతుడు గ‌త కొంత‌కాలంగా అవ‌కాశాల్లేక కెరీర్ ప‌రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి `ఖైదీనంబ‌ర్ 150` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చినా.. ఆ వెంట‌నే చేసిన ఓ త‌ప్పిదం వినాయ‌క్ కి పెద్ద డ్రా బ్యాక్ అయ్యింది. అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ `అఖిల్‌`.. సాయిధ‌ర‌మ్ తో తెర‌కెక్కించిన `ఇంటెలిజెంట్` రెండూ డిజాస్ట‌ర్లు అవ్వ‌డం వినాయ‌క్ ని బ్యాక్ బెంచీకి ప‌రిమితం చేశాయి.

అయినా ప‌రాజ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తాను చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇటీవ‌ల నట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌థ వినిపించారు వినాయ‌క్. అయితే స్క్రిప్టుతో మెప్పించ‌డంలో త‌డ‌బ‌డ్డార‌ని .. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంచార‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం అవుతోంది. మ‌రోవైపు  వినాయ‌క్‌ కి అత్యంత స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా క్యాన్సిల్ కాలేద‌ని.. హోల్డ్ లో మాత్రం ఉంచార‌ని రివీల్ చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ తో నూ వినాయ‌క్ వేరొక ప్రాజెక్టు కోసం వ‌ర్క్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇలా వినాయ‌క్ తదుప‌రి ప్రాజెక్ట్ గురించిన‌ చ‌ర్చ సాగుతుండ‌గానే లేటెస్టుగా అంత‌ర్జాలంలోకి వ‌చ్చిన‌ ఈ ఫోటో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ ఈ ఫోటోలో ఉన్న కుర్రాడెవ‌రు?  వినాయ‌క్ అంత ప్రేమ‌గా కేక్ తినిపిస్తూ ఎందుకు మురిసిపోతున్నారు? అంటే .. ఆ కుర్రాడు మ‌రెవ‌రో కాదు. వినాయ‌క్ వార‌సుడు కుంద‌న్ కృష్ణ‌(16). అత‌డు 10వ త‌ర‌గ‌తి ఏ గ్రేడ్ లో ప్యాస‌య్యాడు. ఈ సంద‌ర్భంగా బంధుమిత్రుల స‌మ‌క్షంలో వినాయక్ గ్రాండ్ గా సెల‌బ్రేష‌న్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఇక కుంద‌న్ ఇంట‌ర్ లోకి వ‌చ్చేస్తున్నాడు కాబ‌ట్టి.. నూనూగు మీసాల బాల‌కుడు ల‌వ్ స్టోరీల్లో న‌టిస్తాడా? అంటూ అభిమానులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే కొడుకు కెరీర్ విష‌యంలో ఇంత‌కీ వినాయ‌క్ ఆలోచ‌న ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. న‌ట‌వార‌సులు తెరంగేట్రం చేస్తున్న సంద‌ర్భ‌మిది. మెగాస్టార్ కి అత్యంత స‌న్నిహితుడు.. ఇండ‌స్ట్రీలో.. బిజినెస్ వ‌ర్గాల్లో బెస్ట్ క‌మ్యూనికేష‌న్ ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ కుమారుడి డెబ్యూ అంటే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉండ‌డం స‌హ‌జం. మ‌రి వినాయ‌క్ ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతారేమో చూడాలి.
Tags:    

Similar News