రౌడీ సంబరం! సంక్రాంతి కళ తెచ్చావు పెద్దోడా..!
యువ నటుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఖుషి చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఖుషీ టీమ్ తో చేరుతోందని కథనాలొచ్చాయి.
ఇంతలోనే సంక్రాంతి సెలవులను అంతా ఆస్వాధిస్తున్నారు. విజయ్ తన నివాసంలో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నాడు. ఆ తర్వాత అతను తన సోదరుడు .. తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఈ పవిత్రమైన రోజున కుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫ్రేమ్ లో ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. దేవరకొండ అతడి సోదరుడు తన తండ్రిగారు ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపించారు. రౌడీ అమ్మగారు సింపుల్ గా నవ్వులు విరజిమ్ముతూ ఆహ్లదాన్ని పంచారు. ఇక మెడలో బంగారు వర్ణం శాలువాతో విజయ్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. తాత్కాలికంగా VD 12 అని ఈ చిత్రానికి టైటిల్ ని నిర్ణయించారు. పేరున్న నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.