ఆమిర్ ఖాన్ తో గొడవలేదన్న విజయ్ సేతుపతి
ఆమిర్ ఖాన్ తాజా చిత్రంగా 'లాల్ సింగ్ చద్దా' సినిమా రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కరీనా కపూర్ కనిపించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టులో ఆయన లేడనే ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదనే చాలామంది అనుకున్నారు. విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో తాను లేనన్నట్టుగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ సినిమా .. అందునా ఆమిర్ ఖాన్ కాంబినేషన్ .. ఏం జరిగి ఉంటుందని ఆలోచనలో పడ్డారు.
ఆమిర్ ఖాన్ కి మిస్టర్ పెర్ఫెక్ట్ అనే పేరు ఉంది .. అందువలన ఆయన విజయ్ సేతుపతిని కాస్త లావు తగ్గమని చెప్పాడట. ఆయన బరువు తగ్గితేనే ఆ పాత్రకి సెట్ అవుతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడనీ, అయితే ఆ విషయాన్ని గురించి విజయ్ సేతుపతి పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆయన అలా లైట్ తీసుకోవడం ఆమిర్ కి నచ్చని కారణంగా అసహనాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఆమిర్ ధోరణి నచ్చని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి బయటకి వచ్చేశాడని చెప్పుకుంటున్నారు.
ఈ ప్రచారం అంతకంతకూ ఊపందుకోవడంతో, విజయ్ సేతుపతి క్లారిటీ ఇవ్వవలసి వచ్చింది. తాజాగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ, నన్ను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. అలా అని చెప్పేసి నేను కూడా ఈ ప్రాజెక్టు నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకోలేదు. లాక్ డౌన్ కి ముందు ఆమిర్ ఖాన్ స్వయంగా చెన్నై వచ్చి నాకు ఈ కథను చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే అంగీకరించాను. అయితే లాక్ డౌన్ తరువాత నా డేట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. నేను డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ఆమిర్ తో ఆ సినిమా చేయలేకపోయాను. ఆయనతో నాకు ఎలాంటి గొడవా లేదు. ఆమిర్ నా పట్ల చూపిన ప్రేమాభిమానాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం మళ్లీ రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.