సైమా లో ఈ షాక్ లేంటి విజయ్?
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ స్టైలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా విజయ్ లో వస్తోన్న మార్పులతో పాటు స్టైలింగ్ విషయంలోనూ అంతే ఛేంజ్ ఓవర్ కనిపిస్తుంది. డ్రెస్సింగ్ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన ఓ ఐడెంటిటీ ఉండేలా చూసుకుంటున్నాడు. ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి బధులుగా ట్రెండ్ సెట్ చేసేలా ఫ్యాషన్ ఎంపికలు కనిపిస్తున్నాయి.
తాజాగా ప్రతిష్టాత్మక సైమా అవార్డు వేడుకలకు ఏకంగా డిజైనర్ షార్ట్.. ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ లో హాజరయ్యాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఇదేంటి? ఇతను ఇలాంటి డ్రెస్ లో సైమా వేడుకలకు వచ్చాడు? అని తమని తామే ప్రశ్నించుకున్నారు. సైమాన నిర్వాహకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక నెటి జనుల సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. ఎవరి స్టైల్లో వారు కామెంట్లు గుప్పించి చెలరేగుతున్నారు.
ఇలాంటి వేడుకలకు ఎవరైనా షార్టులతో వెళ్తారా? `లైగర్` ఇచ్చిన షాక్ తో అతను మళ్లీ యధాస్థితికి వస్తాడని భావించాం. సాధారణంగా నటిస్తాడని అనుకుంటున్నాం. కానీ అతని వే ఆఫ్ అప్రోచ్ చూస్తుంటే అలా కనిపించలేదు` అంటూ ఓ నెటి జనుడు కామెంట్ పెట్టాడు. ఇంకా పలురకాల షేర్ చేసుకున్న అభిప్రాయాలు కామెంట్ల రూపంలో వైరల్ అవుతున్నాయి.
అయితే విజయ్ ఇలా కనిపించింది అవార్డుల బహుకరించే వేదికపైనో..గ్యాలరీలోనే కాదు. అవార్డు వేడులకు ముందు ఇలా షార్ట్ లో కనిపించారు. దానికి ముందు ఇలా సింపుల్ వేర్స్ లో కనిపించారు. ఆ సమయంలోనే కెమెరాలాకి చిక్కాడు. అవి నెట్టింట లీక్ అయ్యాయి. విజయ్ ఇటవలే లైగర్ సినిమా కోసం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టీమ్ తో పనిచేసిన సంగతి తెలిసిందే.
`లైగర్` ప్రచారం కోసం వివిధ సిటీలకు తిరిగారు. ఆ సమయంలో విజయ్ క్యాజువల్స్ లో నే అన్ని రకాల ప్రచారాలకు హాజరయ్యారు. ఓ సందర్భంలో ఏకంగా మీడియా ముందునే తన ముందున్న టేబుల్ పై కాళ్లు పెట్టి షో చేసాడు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు తెచ్చి పెట్టింది. తాజా సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
ఇక పూరి స్టైలింగ్ విషయంలో న్యూ ట్రెండ్ ని అనుసరిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఇష్టపడుతుంటారు. తన హీరోల్ని సైతం సినిమాల్లో అలాగే చూపించడానికి ఇష్టపడతారు. లైగర్ లో విజయ్ ని అలాగే తీర్చి దిద్దారు. ఆ రకంగా విజయ్ స్టైలింగ్ పట్ల మరింత అట్రాక్టివ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ మార్పులన్ని ఎక్కువగా పూరితో పనిచేసినప్పటి నుంచే వచ్చాయి. మరి రీల్ లైగర్ ఏమంటుందో?