బిచ్చగాడు.. ఇదంతా టైటిల్ మహిమే

Update: 2016-06-01 04:53 GMT
బిచ్చగాడు.. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకూ ఇప్పుడీ సినిమా సెన్సేషనే. అంతా కలిపి 50లక్షల్లోపు ఖర్చుతో రిలీజ్ అయిపోయిన పిచ్చైక్కారన్ డబ్బింగ్ వెర్షన్ బిచ్చగాడు.. అందుకు 10రెట్లకు పైగా వసూలు చేసేశాడు. అసలు బిచ్చగాడు అనే టైటిల్ తో సినిమా చేయడం అంటేనే రిస్క్ అని, జనాలు థియేటర్లకు వస్తారా అనే మాటలు వినిపించాయి.

ఆశ్చర్యకరంగా బిచ్చగాడు డబ్బింగ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అనే రేంజ్ కి వెళ్లిపోయింది. ఇదంతా టైటిల్ మహిమే అంటున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. 'అసలు బిచ్చగాడు అనేది నెగిటివ్ టైటిల్. కానీ ఈ సినిమా చూసినవారంతా.. ఈ కథకు ఇదే సరైనది అంటున్నారు. మదర్ సెంటిమెంట్ తో పాటు ప్రేమ, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జనాలకు నచ్చాయని.. అందుకే ఇంత పెద్ద హిట్ అయింద'ని అంటున్నాడు హీరో. గతంలో నకిలీ, డా. సలీమ్ లను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చినా అవి పెద్దగా ఆడలేదు. కానీ త్వరలో సైతాన్, యముడు అంటూ మరో రెండు సినిమాలను విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నట్లు చెబుతున్నాడు.

'50 థియేటర్లతో మొదలుపెట్టి ఇప్పటికి 250 థియేటర్లకు చేరుకుంది బిచ్చగాడు. సినిమా కథలో బలం అందరినీ ఆకట్టుకుంది' అని చెప్పాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.
Tags:    

Similar News