విద్యాబాలన్‌ బాగా కాస్ట్‌ లీ గురూ.!

Update: 2018-12-24 13:06 GMT
రీసెంట్‌ టైమ్‌ లో మోస్ట్ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడు. ఇండస్ట్రీలో ఉన్న హేమాహేమీలంతా ఇందులో నటించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - హన్సిక - పాయల్‌ - నిత్యామీనన్‌.. చెప్పుకుంటూ పోవాలే కానీ.. హాట్‌ హీరోయిన్స్‌ అందరూ దాదాపుగా ఉన్నారు. వీళ్లందరివి డే కాల్షీట్లే. అంటే.. ఒక రోజో - రెండు రోజులో షూటింగ్స్‌. వారికి రెమ్యూనరేషన్‌ కూడా పెద్దగా ఉండదు. అయితే.. ఈ సినిమాలో ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంది, అందరికంటే ఎక్కువ రోజులు నటించింది మాత్రం విద్యాబాలనే. బయోపిక్‌ లో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించింది.

బసవతారకం పాత్రకు మొదట్లో చాలామందిని అనుకున్నా.. ఎవ్వరూ సెట్ కాలేదు. చివరకు విద్యాబాలన్‌ ని సెలెక్ట్ చేశారు. ఆమె కోసం ముంబై వెళ్లి కథ చెప్పి మరీ సినిమాకు ఒప్పించారు. బయోపిక్‌ కోసం దాదాపు 15 రోజుల కాల్షీట్లు ఇచ్చింది. ఇక ఒక రోజు కాల్షీట్‌ కు ఆమె వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా… దాదాపు 5 లక్షల రూపాయలు. ఇవి కాకుండా.. ఆమె హోటల్ - తిండి - మేకప్‌ - పర్సనల్‌ అసిస్టెంట్స్‌ - కేరవాన్‌ ఇవన్నీ కలుపుకుంటే.. ఆమె బడ్జెట్‌ దాదాపు కోటి రూపాయలు దాటినట్లే. బసవతారకం పాత్రకు విద్యాబాలన్‌ పర్‌ ఫెక్ట్‌ గా సరిపోయింది. అందుకే ఖర్చు విషయంలో బాలయ్య ఎక్కడా రాజీపడలేదు. ఇప్పుడా రిజల్ట్‌ ట్రైలర్‌ లో స్పష్టంగా కన్పిస్తుంది.
Tags:    

Similar News