• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ రాజా కోసం అతను...

మాస్ రాజా కోసం అతను మారిపోయాడు

By - Tupaki Desk
Update: 2018-04-25 05:18 GMT
మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. కథలు రాసి అందుకు తగ్గ హీరోల్ని ఎంచుకోవడం కంటే.. హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే రచయితలు.. దర్శకులే ఎక్కువ ఇక్కడ. చాలామంది దర్శకులు హీరోల కోసం తమ అభిరుచుల్ని.. తమ శైలిని మార్చుకుంటూ ఉంటారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం.

తెలుగులో తాను తీసిన  ‘టైగర్’తోనే వైవిధ్యం చూపించాడు ఆనంద్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అతనెంత భిన్నమైన దర్శకుడో చూపించింది. దీని తర్వాత తీసిన ‘ఒక్క క్షణం’ కూడా వైవిధ్యమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడతను మాస్ రాజా రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం వీఐ ఆనంద్ గత సినిమాల తరహాలో ఉండదట. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం.

ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే పేరు కూడా ఖరారు చేసేశాడు ఆనంద్. ఈ టైటిల్‌ ను బట్టే ఇది ఆనంద్ మార్కు సినిమా కాదు.. రవితేజ స్టైల్ మూవీ అనే విషయం స్పష్టమవుతుంది. రవితేజ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అతను ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరక్షన్లో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వస్తుంది. ఆపై వీఐ ఆనంద్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు మాస్ రాజా.
Tags:    
  • VI anand 
  • Ravi Teja 
  • TElugu NEWs 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS