'సూప‌ర్ హీరోస్‌'కి 'విక్టరీ' సెల్యూట్...!

Update: 2020-04-11 08:50 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియని ఆందోళన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మన తెలుగు రాష్టాల్లో కూడా రోజు రోజుకి కరోనా కేసులు - కరోనా మరణాలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన ప్రభుత్వాలు ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తూ వస్తున్నారు. ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని చూసి ఏ మాత్రం భయపడకుండా త‌మ ప్రాణాల‌ని రిస్క్‌ లో పెట్టి మరీ ప‌ని చేస్తున్నారు వైద్యులు - పోలీసులు - పారిశుద్ధ్య కార్మికులు. వీరి త్యాగాన్ని గుర్తిస్తున్న ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల నాగ చైత‌న్య‌ - మ‌హేష్ బాబు - చిరంజీవి వంటి టాలీవుడ్ స్టార్ సెల‌బ్రిటీస్ పోలీసుల ప‌నితీరుని మెచ్చుకొని వారికి సెల్యూట్ చేశారు. తాజాగా వీరి జాబితాలో విక్టరీ వెంక‌టేష్ కూడా చేరారు.

కోవిడ్ 19కి వ్య‌తిరేఖంగా పెద్ద పోరాటం చేస్తున్న పోలీసులు - వైద్య సిబ్బందికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు వెంక‌టేష్‌. 'ఈ కఠినమైన సమయాల్లో మా జీవితాలను మరియు మా కుటుంబాలను కాపాడినందుకు ధన్యవాదాలు. మీరే అస‌లైన రియ‌ల్ హీరోస్‌.. మీకు మా సెల్యూట్' అని విక్టరీ వెంక‌టేష్ త‌న ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్నారు. దేశానికి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు స్పందించడానికి ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ ఈసారి కూడా ముందుకొచ్చింది. కరోనా బాధితులకు సహాయం చేయడానికి తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖులందరూ కలిసి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోడానికి కంకణం కట్టుకున్నారు. 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసి వారందరికి ఆపన్న హస్తం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా లాస్ట్ ఇయర్ 'ఎఫ్ 2' - 'వెంకీమామ' చిత్రాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో 'నారప్ప' అనే మూవీ చేస్తున్నారు. తమిళ హిట్ మూవీ 'అసురన్' సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం - లాక్ డౌన్ అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.




Tags:    

Similar News