• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా - నందమూరి ఫ్యాన్స్...

మెగా - నందమూరి ఫ్యాన్స్ ని ఎలా బ్యాలన్స్ చేస్తారో..?

By - Tupaki Desk
Update: 2022-11-17 15:11 GMT
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం బాలయ్య పోటీ పడబోతున్నారు. 'వాల్తేరు వీరయ్య' & 'వీర సింహారెడ్డి' చిత్రాలను పండక్కి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చాలా కాలం తర్వాత సీనియర్ హీరోలు ఒకేసారి వస్తుండటంతో అభిమానులతో పాటుగా సినీ వర్గాల్లో అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన రెండు సినిమాలూ ఒకటీ లేదా రెండు రోజుల గ్యాప్ లో వస్తుండటంతో ట్రేడ్‌ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. రెండు చిత్రాలకు ఏ విధంగా ప్రమోషన్స్ చేస్తారు? మెగా - నందమూరి అభిమానులను సంతృప్తి పరిచేలా ఎలాంటి కంటెంట్ వదులుతారు? అని అందరూ చూస్తున్నారు.

ఫెస్టివల్ కు నెల రోజుల సమయం కూడా లేదు. ఇంకా షూటింగ్స్ కంప్లీట్ అవ్వలేదు.. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ స్పీడ్ పెంచలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ టీజర్‌లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత సందడి చేయడానికి రెండు చిత్రాల నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు.

ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'బాస్ పార్టీ' అనే సాంగ్ ని సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో 'వీర సింహారెడ్డి' చిత్రం నుంచి థమన్ కంపోజ్ చేసిన సాంగ్ ని విడుదల చేయాలని నందమూరి అభిమానుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.

 ప్రీరిలీజ్ బజ్‌ ని క్రియేట్ చేయడానికి రాబోయే రోజుల్లోనూ మేకర్స్ ఇరు వర్గాలను బ్యాలన్స్ చేస్తూ పాటలు - ట్రైలర్ వంటి ప్రమోషనల్ మెటీరియల్‌ ను అందించాల్సి ఉంటుంది. మామూలుగానే మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తరచుగా వార్స్ జరుగుతుంటాయి.

అలాంటిది ఇప్పుడు ఒకేసారి తమ ఫేవరేట్ హీరోల చిత్రాలు వస్తున్నాయంటే అది నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. రెండు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ మధ్య పోలికలు మరియు ట్రోలింగ్ జరుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా అభిమానులు అటు తిరిగి ఇటు తిరిగి నిర్మాతలపైనే విమర్శల దాడి చేస్తారు.

అందుకే బెస్ట్ కంటెంట్ ని అందించడానికి మేకర్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే రాబోయే నెల రోజులు మైత్రీ మూవీ మేకర్స్ కు చాలా కీలకమని చెప్పాలి. ఓవైపు సినిమా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు ఫ్యాన్స్ ని మేనేజ్ చేస్తూ చిత్రాలను రిలీజ్ చెయ్యాలి. మరి మైత్రీ టీం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

కాగా, కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి సరసన కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు 'వీర సింహా రెడ్డి' సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఇందులోనూ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • staractress 
  • movies 
  • chiranjeevi 
  • WaltairVeerayya 
  • directorBobby 
  • GopichandMalineni 
  • VeeraSimhaReddy 
  • latestnews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS