పవన్ తో నటించాలంటే వణుకే అంటున్నాడు
చిరంజీవి సినిమాల్లో నాగబాబు తరచుగా కనిపించేవాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ఒకట్రెండుసార్లు తళుక్కుమన్నాడు. మరి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. తన పెదనాన్న - బాబయిలతో ఎప్పుడు నటిస్తాడు అని మెగా అభిమానుల్లో ఒక ఆసక్తి ఉంది. ఐతే పెదనాన్న చిరంజీవితో ఆల్రెడీ నటించేశానని.. ఇక పవన్ బాబాయే బ్యాలెన్స్ అని.. కానీ ఆయనతో నటించాలంటే తనకు వణుకు వచ్చేస్తుందని అంటున్నాడీ యువ కథానాయకుడు.
‘‘నేను పెదనాన్నతో నటించిన సంగతి చాలామందికి తెలియదు. హ్యాండ్సప్ సినిమాలో నేనో చిన్న పాత్రలో కనిపిస్తా. అంతే కాదు.. థమ్సప్ యాడ్ లో కూడా ఇద్దరం కలిసి నటించాం. ఐతే పవన్ బాబాయితో నటించే అవకాశం రాలేదు. ఒకవేళ అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించడానికి నాకు వణుకు వచ్చేస్తుందేమో. అలాగని ఆ ఛాన్స్ మాత్రం వదులుకోను. ఎప్పటికైనా బాబాయితో బాగా చేశావ్ అని కాంప్లమెంట్ తీసుకోవాలన్నది నా కోరిక. ఇక మా ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆల్రెడీ చరణ్ అన్నతో ఈ విషయం మాట్లాడాను. మంచి కథ దొరికితే నేను - చరణ్ - బన్నీ - తేజు.. అందరం కలిసి నటించడానికి సిద్ధం. ఇక మా ఫ్యామిలీ హీరోల పాటల్నైతే రీమిక్స్ చేసే ఉద్దేశం నాకు లేదు. దర్శకుడు అది అవసరమని పట్టుబడితే మాత్రం ఓకే’’ అని చెప్పాడు వరుణ్.