'వకీల్ సాబ్' ఆశించిన స్థాయిలో మగువల ఆదరణ దక్కలేదా..?

Update: 2021-04-17 09:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' ప్రపంచ వ్యాప్తంగా గత శుక్రవారం గ్రాండ్ గా విడుదల అయింది. 'పింక్‌' రీమేక్‌ గా వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బోనీకపూర్ - దిల్ రాజు కలిసి నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్ళు రాబట్టి రెండో వారంలోకి అడుగుపెట్టింది. అధికారికంగా లెక్కలు వెల్లడించనప్పటికీ ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని.. పవన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. అయితే మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగున్నా.. నాలుగో రోజు నుంచి వసూళ్ళు భారీగా త‌గ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆడవాళ్ళను థియేటర్లకు రప్పించాలనే విధంగా 'వకీల్ సాబ్' ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ ఇది మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి మగువల ఆదరణ దక్కుతుందని ఆశించారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కి వ‌చ్చి సినిమాలు చూసేందుకు సాహసించ‌డం లేదని నాలుగో రోజు నుంచి అర్థం అయింది. ఆశించిన స్థాయిలో లేడీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. ఇది గమనించే మిగతా నిర్మాతలు తమ సినిమాలని వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి మేకర్స్ స్ట్రాట‌జీ కలిసొచ్చి ఆడ‌వాళ్ళు థియేట‌ర్ల‌కి వ‌స్తే 'వ‌కీల్ సాబ్' సినిమా ఇప్పటికే దాదాపు 250 కోట్లు క‌లెక్ట్ చేసేది. ఈ నేపథ్యంలో పవన్ రాజ‌కీయాల్లోకి వెళ్లిన తర్వాత మహిళా ప్రేక్షకులను కోల్పోయాడని.. ఇది 'వ‌కీల్ సాబ్' క‌లెక్ష‌న్స్ తో మ‌రో సారి ప్రూవ్ అయిందని టాక్ నడుస్తోంది. అయితే1 ఇంకా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండటం.. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి 'వకీల్ సాబ్' నెమ్మదిగా అయినా వసూళ్ళు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags:    

Similar News