బిగ్ బాస్ బ్యూటీ పాల మీగ‌డ మిస‌మిస‌లు!

Update: 2022-03-17 09:30 GMT
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్  చేస్తోంది. జ‌స్ట్ అలా క‌నిపిస్తే చాలు యూత్ మ‌తి చెడిపోతోంది అంతే. అంత‌గా వేడెక్కించే స్టింట్ తో క‌వ్విస్తోంది ఉర్ఫీ. అయితే ఉర్ఫీపై ట్రోలింగ్ అదే రేంజులో ఉంది.  ఉర్ఫీ జావేద్ తన తాజా బ్లూ బికినీని షేర్ చేయ‌గానే దానిపై ట్రోలింగ్ విప‌రీతంగా మొద‌లైంది!

బిగ్ బాస్ OTTలో మొదటి వారంలోనే ఉర్ఫీ జావేద్ తొలగించబడినా కానీ ..ఈ బ్యూటీ ప్ర‌చారార్భాటంతో జీవితంలో గెలుస్తోంది. ఉర్ఫీ నిజానికి హెడ్ లైన్స్ లో లేని రోజు లేదు. రోజు ముగిసేప్ప‌టికే మంచి లేదా చెడు ఏదో ఒక‌టి ఉర్ఫీకి పబ్లిసిటీగా మారుతోంది. ప్ర‌స్తుతం ఈ నటి బ్లూ బికినీపై ట్రోలింగ్ సాగుతోంది.

పదే పదే ఉర్ఫీ కొన్ని అవుట్-ఆఫ్-ది-బాక్స్ దుస్తులతో వస్తోందన్న‌ది కొంద‌రు నెటిజ‌నుల ఆవేద‌న‌. అయితే ఉర్ఫీ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎల్లప్పుడూ తన అద్భుతమైన  డిజైన‌ర్ లుక్ తో మెస్మ‌రైజ్ చేస్తోంది. గతంలో కెండల్ జెన్నర్.. రిహన్న.. బెల్లా హడిద్ ధరించిన దుస్తులతో మెరిపించింది. ఆమె తాజా లుక్ బీచ్ బేబ్ అవ‌తారం షేక్ చేస్తోంది.

కొద్దిసేపటి క్రితం ఉర్ఫీ జావేద్ తన ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి తన బీచ్ లుక్ ను షేర్ చేసింది. ఇందులో బ్లూ బికినీలో కనిపించింది. ఆమె అదే రంగు చీరతో వేషధారణలో క‌నిపించ‌డం షాకిచ్చింది.

ఎల్లప్పుడూ బీచ్ బేబీ !! అంటూ ఉర్ఫీ జావేద్ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చారు. దీనికి నెటిజనులు తీవ్ర‌మైన‌ కామెంట్లు చేశారు.  పోస్ట్ పై మిశ్రమ స్పందనలు ఇచ్చారు. ఎప్పటిలాగే  బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ తన దుస్తులను అలా ఓపెన‌ప్ చేసినందుకు చాలా సిగ్గుపడింది.

"ఇండియా మే సర్దీ నహీ ఐ అబీ?" అని వ్యాఖ్యానించడంతో ఒక వినియోగదారు విస్తుపోయేలా చేశారు.  మరొకరు `ఆగ్ హి లగా డి` అని వ్యాఖ్యానించారు. అబ్ బచా క్యా హై, యే భీ ఉతర్ దో.. అని ఒక కామెంట్ వినిపించింది. ఒక నెటిజన్, “ఇస్కా బాస్ నీ చల్తా నీ తో యే బి నా పెహ్నే” అని రాశాడు. ఏది ఏమైనా తొంద‌ర్లోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాల‌ని చూస్తున్న ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఆఫ‌ర్లు రావాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News