• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత సినిమా రిలీజ్ డేట్...

సమంత సినిమా రిలీజ్ డేట్ గందరగోళం కంటిన్యూ

By - Tupaki Desk
Update: 2022-08-14 11:31 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల నటించిన యశోద మరియు శాకుంతలం సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనుకుంటే ఆ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేకుండా ఉంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.

యశోద సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఆగస్టు 12వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించి.. అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోతున్నాం అంటూ ఇటీవల యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. ఆగస్టు లో విడుదల కాని సినిమా ను సెప్టెంబర్ కి వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ లో అయినా ఈ సినిమా విడుదల అయ్యేది అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. సమంత ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినా కూడా ఎందుకు విడుదల ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో రాజీ పడకపోవడం వల్ల విడుదల ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో సమంతతో పాటు తమిళ నటి వరలక్ష్మి మరియు ఉన్ని ముకుందన్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా కు దర్శక ద్వయం హరి హరీష్ లు దర్శకత్వం వహించారు. షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి చేసిన యశోద యూనిట్ సభ్యులు గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఆలస్యం వల్ల విడుదల వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు.

కొత్త విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు గందరగోళంలో ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం మరియు యశోద రెండు సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్కటైనా ఈ ఏడాది విడుదల అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • TollywoodFilms 
  • SamanthaRuthPrabhu 
  • YashodhaFilm 
  • ShakuntalamFilm 
  • HariHarish 
  • FilmIndustry 
  • SamanthaFilmsRelease 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS