• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళంతో రాబోతున్న సూపర్...

తమిళంతో రాబోతున్న సూపర్ హిట్ సీక్వెల్స్

By - Tupaki Desk
Update: 2022-10-27 02:34 GMT
ఇటీవల కాలంలో సక్సెస్ అయిన సినిమాలకు మళ్ళీ సీక్వెల్స్ తెరపైకి తీసుకువస్తూ ఉండడంతో మంచి క్రేజ్ అయితే దగ్గుతోంది. కంటెంట్ బాగుంటే మాత్రం సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే అందుతున్నాయి. ఇక మిగతా భాషల్లో కంటే తమిళంలోనే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు సీక్వెల్స్ సెట్స్ పైకి వస్తూ ఉండడం విశేషం.

ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమాలకు కూడా ప్రస్తుతం సీక్వెల్స్ ప్లాన్ స్టార్ట్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కొత్త అయితే పూర్తయింది. ఇక వీలైనంత త్వరగా మిగిలిన పనులను కూడా పూర్తి చేసి మళ్లీ వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే సెకండ్ పార్ట్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఖైదీ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే ప్రేక్షకుల వద్దకు రాబోతోంది. దర్శకుడు కార్తీ ఇదివరకే ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే ఖైదీ సినిమాలోని పాత్రను విక్రమ్ సినిమాలో కూడా చూపించిన విషయం తెలిసిందే. మల్టీ వర్డ్స్ కాన్సెప్ట్ తోనే దర్శకుడు మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది.

అలాగే విక్రమ్ సీక్వెల్ కూడా ఉంటుంది అని కమల్ హాసన్ ఇదివరకే తెలియజేశారు. విక్రమ్ ఫస్ట్ పార్ట్ లో సూర్య రోలెక్స్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. కాబట్టి అలాంటి పాత్రతోనే కథను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. అందులోనే మిగతా సినిమాలలోని కొన్ని క్యారెక్టర్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్గా కార్తీ నటించిన సర్దార్ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతున్నట్లు కార్తీ అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. చాలా రోజుల తర్వాత కార్తీకి తెలుగులో కూడా మంచి సక్సెస్ అయితే దక్కింది. మరి తమిళ సీక్వెల్స్ లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Kollywood 
  • moviesquals 
  • vikram 
  • khaidi 
  • PS1 
  • latestnews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS