'ప్రాజెక్ట్‌ కే' ప్రభాస్‌ కాకుండా మరో ఇద్దరు హీరోలు?

Update: 2021-08-04 10:50 GMT
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ ల్లో ప్రాజెక్ట్‌ కే ఒకటి. మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపిక పదుకునే హీరోయిన్‌ గా అమితాబచ్చన్‌ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆదిత్య 369 మరియు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల కలబోతే ఈ సినిమా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంతో సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన మరో పుకారు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త నిజమే అయితే ఖచ్చితంగా ప్రాజెక్ట్‌ కే స్థాయి అమాంతం పెరగడం ఖాయం. ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు యంగ్‌ స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నారు అనేది ఆ పుకార్ల సారాంశం.

టాలీవుడ్‌ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌ కే కథానుసారంగా అమితాబచ్చన్‌ కాంబోలో కీలక సన్నివేశాల్లో నటించేందుకు ఇద్దరు యంగ్‌ స్టార్స్ కావాల్సి ఉంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ కాంబోలో సన్నివేశాలు కనుక ఎవరో చిన్నా చితక నటులను పెట్టడం అనేది ఆయన స్థాయిని అవమానించినట్లుగ అవుతుందనే ఉద్దేశ్యంతో ఇద్దరు యంగ్ స్టార్‌ హీరోలను గెస్ట్‌ పాత్రల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు హీరోలు కూడా మూడు నాలుగు రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆ పాత్రల తో సినిమా స్థాయి పెరుగుతుందని అంటున్నారు.

టాలీవుడ్‌ లో నాగ్‌ అశ్విన్ కు సన్నిహితం అయిన వారు పలువురు హీరోలు ఉన్నారు. విజయ్‌ దేవరకొండ మరియు దుల్కర్‌ సల్మాన్ లను ఈ సినిమాలో నటింపజేస్తే ఎలా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. నవీన్ పొలిశెట్టిని కూడా ఈ సినిమాలో నటింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇతర భాషల హీరోలు కూడా ఆ పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పాత్రల విషయంలో దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నారు. ప్రాజెక్ట్‌ కే వల్ల గ్లోబల్‌ స్టార్ గా మారడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News