క్లిక్ క్లిక్‌ః ఈ వయసులో అందాల ప్రదర్శణ అవసరమా బామ్మ!

Update: 2021-01-17 03:32 GMT
సోషల్ మీడియాలో కేరళ సీనియర్ నటి.. మాజీ బిగ్ బాస్ మలయాళం కంటెస్టెంట్ రజినీ చాందీ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాదాపుగా ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్న ఆమె ఈ వయసులో వైరల్‌ అయ్యిందంటే మామూలు విషయం కాదు. అది కూడా అందాల ఆరబోత పొటోలతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. రజినీ చాందీ ఫొటోలు వైరల్ అవ్వడానికి అంతగా ఏమున్నాయి అంటే ఈ వయసులో ఆమె క్లీవేజ్ షో చేయడంతో పాటు స్విమ్‌ షూట్‌ వేసింది. ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్‌ ఇచ్చిన ఫోజ్‌ లపై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ రేంజ్ లో బామ్మగారు ఏంటీ ఈ రచ్చ.. ఈ వయసులో మీకు ఈ అందాల ప్రదర్శణ అవసరమా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

రజినీ చాందీ ని ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అథిర జాయ్ ఫొటో షూట్‌ చేయాలనుకున్నాడు. ఆమెకున్న క్రేజ్ నేపథ్యంలో ఒక గ్లామర్‌ ఫొటో షూట్‌ ను చేయడం వల్ల ఖచ్చితంగా ట్రెండ్‌ అవ్వడంతో పాటు ప్రయోజనం దక్కించుకోవచ్చు అనుకున్నాడు. అతడి రజినీ ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానంతో అడిగినా తనకు ఇష్టమే అన్నట్లుగా రజినీ చెప్పుకొచ్చింది. పొట్టి డ్రస్‌ లు వేసుకోవడంతో పాటు స్విమ్‌ సూట్‌ కు కూడా ఓకే చెప్పింది. అలా చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యి చాందీ ని ట్రోల్‌ చేసే వరకు వచ్చాయి.

తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ పై చాందీ మౌనం గా ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఈ వయసులో కూడా ఆమె ఆత్మవిశ్వాసంకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంత వయసులో కూడా ఆమె ఫిట్‌ గా ఉండటం ను చూపించిన ఫొటోగ్రాఫర్‌ కు అభినందనలు అంటూ ప్రతి ఒక్క అమ్మాయికి మహిళకు చాందీ ఆదర్శం అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News