తీన్ మార్ తర్వాత మళ్లీ రాస్తున్నాడు
పవన్ కల్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు నిర్మించే సినిమా గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత, 2016లో ఈ సినిమా ఆన్ సెట్స్ కి వెళుతుంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. పవన్ తో సినిమాని దాసరి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అందుకే స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని రంగంలోకి దించారు. అయితే ఈ సినిమాకి దాసరి దర్శకత్వం వహిస్తారా? డాలీ దర్శకత్వం వహిస్తాడా? అన్నది సస్పెన్స్.
జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన త్రివిక్రమ్ తన స్నేహితుడు పవన్ కోసం సీన్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు స్క్రిప్టు పనులు చేస్తున్నాడు. డాలీ త్రివిక్రమ్ తో కలిసి స్క్రిప్టు పనుల్లో తలమునకలుగా ఉన్నారని దాసరి కాంపౌండ్ న్యూస్. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. కేవలం స్క్రిప్టు విభాగంలో రెండోసారి పనిచేస్తున్నాడు. ఇంతకుముందు జయంత్.సి.ఫరాన్జీతో కలిసి 'తీన్ మార్' స్క్రిప్టు రాసిన త్రివిక్రమ్. ఇప్పుడు రెండోసారి పవన్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. ఈసారి తీన్ మార్ ఫలితం రిపీటవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో వెయిట్ అండ్ సీ.