అక్కడే పెళ్లి చేసుకుంటానంటోంది

Update: 2020-01-24 13:07 GMT
తెలుగు ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ త్రిష. ఈ అమ్మడు ఈమద్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది కాని ఒకప్పుడు తెలుగు.. తమిళం.. హిందీ ఇలా మూడు భాషల్లో కూడా దడదడలాడించిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు హీరోయిన్‌ గా బిజీగా ఉన్న సమయంలోనే రాహుల్‌ అనే వ్యక్తితో వివాహం ఫిక్స్‌ అయ్యింది. వివాహ నిశ్చితార్థం కూడా అయ్యింది. ఏం జరిగిందో ఏమో కాని ఆ వివాహ నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేసుకుని అతడికి బ్రేకప్‌ చెప్పేసింది.

అప్పటి నుండి త్రిష పెళ్లి ప్రస్థావన తీసుకు రావడం లేదు. అసలు ఈమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోవర్‌ ఒకతను మీకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నాకు పెద్దగా వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు కాని నచ్చిన వ్యక్తి దొరికితే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అది కూడా లాస్‌ వెగాస్‌ లో మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అంది.

పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేదంటూనే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో లాస్‌ వెగాస్‌ లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటీ అమ్మడు అంటూ ఈ అమ్మడిని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే చేసుకుంటే ఒకవేళ బ్రేకప్‌ అయితే అంతా కూడా మళ్లీ బ్యాడ్‌ గా అనుకుంటారని అక్కడ చేసుకుంటాను అంటున్నావా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

లాస్‌ వెగాస్‌ లో ఏమో కాని మొదట త్రిషకు నచ్చే వాడు ఎప్పుడు దొరికేనో ఏమో. వయసేమో నాలుగు పదులకు దగ్గరగా వస్తుంది. మరికొన్నాళ్లయితే నీకు అభిమాన నటి అయిన జయలలిత మాదిరిగా ఉండిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అంటున్నారు.

Tags:    

Similar News