మళ్ళీ ఇదేమి ట్విస్టు దేవర..?

అంటే సెప్టెంబర్ చివరి వారంలో దేవర ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2024-05-08 23:30 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవరతో పాటు వార్-2 సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తారక్.. ఇప్పుడు రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక వార్-2 సినిమా కోసం కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్.. ముంబై వెళ్లారు. అందుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తమ ఫేవరెట్ హీరో తెరపై కనిపించి చాలా నెలలు అయింది కనుక.. ఎప్పుడెప్పుడు తారక్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వార్-2 కన్నా ముందు దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈపాటికే దేవర రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ కు వాయిదా వేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.

ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా చేస్తున్నారు. దీంతో ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు. తారక్ ను ఫుల్ మాస్ రగ్గడ్ లుక్ లో చూపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ దేవర సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారనుందని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రకటించిన తేదీకి రెండు వారాల ముందు రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం.

Read more!

అంటే సెప్టెంబర్ చివరి వారంలో దేవర ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా వరకు మూడు వీకెండ్లు వస్తాయనే ఉద్దేశంతో అలా చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు వినికిడి. అయితే సెప్టెంబర్ 27వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఆ సినిమా మేకర్స్ ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. ఏపీ ఎన్నికల్లో పవన్ బిజీగా ఉండటం వల్ల ఓజీ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. మళ్లీ పవన్ ఎప్పుడు సెట్స్ లోకి అడుగుపెడతారో చెప్పలేం. ఇక ఈ మూవీ మిగతా షూటింగ్ పార్ట్ ముంబై సహా పలు నగరాల్లో చిత్రీకరించాల్సి ఉంది. దీంతో ఓజీ.. సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వడం డౌటేనని టాక్ వస్తోంది. అందుకే హరిహర వీరమల్లును మేకర్స్ 2024లో రిలీజ్ చేస్తామని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే అక్టోబర్ లో సూర్య కంగువ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ- బాబీ కాంబోలో వస్తున్న సినిమా కూడా దసరాకు వచ్చే ఛాన్స్ ఉంది. దేవర కూడా పాన్ ఇండియా మూవీ కనుక సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో విడుదల అయితే అనేక బెనిఫిట్స్ ఉన్నట్లు చెబుతున్నారు సినీ పండితులు. ఓజీ పోస్ట్ పోన్ అయితే తిరుగులేదని అంటున్నారు. మరి దేవర రిలీజ్ ప్రీ-పోన్ అవుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News