• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ కీ బాలీవుడ్ కి...

టాలీవుడ్ కీ బాలీవుడ్ కి మధ్య గేట్లు తీసేసిన స్టార్స్!

By - Tupaki Desk
Update: 2022-05-09 02:30 GMT
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఎక్కువగా విడుదలయ్యేవి. అప్పట్లో భారీ సినిమాలంటే బాలీవుడ్ నుంచి వచ్చేవే. ఆ సినిమాలను గురించి ఎక్కడ చాలా రోజులు చెప్పుకునేవారు. కొన్ని ప్రాంతాలలోని థియేటర్స్ వారు హిందీ సినిమాలను తమ థియేటర్స్ కి ఎక్కువగా తీసుకుని వచ్చేవారు. ఇక బాలీవుడ్ సినిమాలను తెలుగులో బాగానే రీమేక్ చేసేవారు. తెలుగు సినిమాలు మాత్రం బాలీవుడ్లో రీమేక్ కావడం తక్కువే. ఇక తెలుగువారు నేరుగా చేసిన హిందీ సినిమాలు కూడా తక్కువే. అలా తెలుగు హీరోలు చేసిన  దీ సినిమాలు వ్రేళ్ల పైనే లెక్కపెట్టొచ్చు.

 ఇప్పుడు బాలీవుడ్ కీ .. టాలీవుడ్ కి మధ్య ఉన్న గీత దాదాపు చెరిగిపోయింది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని చేరుకుంది. దాంతో ఇక్కడి సినిమాలు రీమేక్ చేయడానికీ .. ఇక్కడి సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్స్  ఆసక్తిని చూపుతున్నారు .. ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. చిరంజీవి 'గాడ్ గాదర్' సినిమాలో సల్మాన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి ఆయన డాన్స్ చేయడం విశేషం. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రభాస్ సినిమా 'ప్రాజెక్టు K'లో అమితాబ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణె అలరించనుంది. ఇక అలియా .. కియారా కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక తెలుగు నుంచి వెళ్లి నేరుగా హిందీ సినిమాలు చేసే హీరోల సంఖ్య  కూడా పెరుగుతోంది. ప్రభాస్ 'ఆది పురుష్' చేస్తే   .. విజయ్ దేవరకొండ ' లైగర్' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక 'ఛత్రపతి' రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా బాలీవుడ్ కి వెళుతున్నాడు.

 ఇక చాలా కాలం క్రితమే బాలీవుడ్ తెరపై మెరిసిన నాగార్జున, 'బ్రహ్మాస్త్ర' ద్వారా మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాడు. ఆమీర్ సినిమా 'లాల్ సింగ్ చద్దా'తో చైతూ కూడా అక్కడ మెరవనున్నాడు. ఇక 'చంటి' ...  'తక్ ధీర్ వాలా' సినిమాలు చేసిన వెంకటేశ్, చాలా కాలం తరువాత బాలీవుడ్ లో మరో సినిమా చేయనున్నాడు. సల్మాన్ తో కలిసి ఆయన ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఇదే సినిమాలో జగపతిబాబు కూడా ఒక ముఖ్యమైన  పాత్రను పోషిస్తున్నాడు. ఇక్కడి సంగీత దర్శకులు కూడా అక్కడికి వెళుతుండటం ఇప్పుడిప్పుడే  ఊపందుకుంటోంది. 
Tags:    
  • Tollywood Drugs case 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS